కరోనా వైరస్‌.. ఎయిర్‌పోర్ట్ అధికారులపై రష్మీ సంచలన ట్వీట్లు..!

భారత్‌లోనూ కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు ఎక్కువవుతోంది. దేశంలో ఇప్పటివరకు 113 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వేలల్లో అనుమానితులు ఉన్నారు. ఈ క్రమంలో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ మహమ్మారికి అడ్డుకట్టవేసేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కరోనా వైరస్‌.. ఎయిర్‌పోర్ట్ అధికారులపై రష్మీ సంచలన ట్వీట్లు..!
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2020 | 7:44 AM

భారత్‌లోనూ కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు ఎక్కువవుతోంది. దేశంలో ఇప్పటివరకు 113 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వేలల్లో అనుమానితులు ఉన్నారు. ఈ క్రమంలో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ మహమ్మారికి అడ్డుకట్టవేసేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ఈ వైరస్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చేపడుతోన్న కరోనా నియంత్రణ చర్యలపై బుల్లితెర బ్యూటీ రష్మీ అసహనం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ స్కానింగ్‌లు కేవలం ఇంటర్నేషనల్ ప్రయాణికులకేనా..? డొమెస్టిక్ ప్రయాణికులకు అవసరం లేదా..? అంటూ రష్మీ ఎయిర్‌పోర్ట్ అధికారులను ప్రశ్నించారు. దానికి స్పందించిన ఎయిర్ పోర్టు సిబ్బంది.. ”APHO ద్వారా స్క్రీనింగ్ జరుగుతుంది. అందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని దేశీయ, విదేశీ టెర్మినల్స్ వద్ద కూడా పరిశుభ్రతకు సంబంధించి అవగాహన చర్యలు తీసుకున్నాం” అని తెలిపింది.

అయితే గత రాత్రి ఎయిర్ పోర్టులో కేవలం సీఐఎస్ఎఫ్ సిబ్బంది మాత్రమే మాస్క్ ధరించి ఉన్న విషయాన్ని తాను గుర్తించానని.. హ్యాండ్ శానిటైజర్ గురించి అడిగినప్పుడు కూడా అక్కడున్న సిబ్బంది వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. తానేం విమానాయన సంస్థల్ని,ఆ సిబ్బందిని నిందించడం లేదని రష్మీ వరుస ట్వీట్లు చేసింది. వాటిపై ఎయిర్ పోర్టు సిబ్బంది కూడా మరో ట్వీట్ చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎయిర్ పోర్టులో మెరుగైన చర్యలు తీసుకుంటున్నాం. వాష్‌రూమ్ శుభ్రపరచడం, ఆటోమేటెడ్ శానిటైజర్‌లను ఉంచడం, ప్రయాణీకులందరిని టచ్‌పాయింట్ల వద్ద క్షుణ్ణంగా పరిశీలించడం, విమానాశ్రయ సిబ్బందికి ఫేస్ మాస్క్‌లు మరియు శానిటైజర్‌లను అందించడం వంటి చర్యలు తీసుకుంటున్నామని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.

Read This Story Also: భారత సాంప్రదాయం ప్రకారం ఆస్ట్రేలియన్ క్రికెటర్ నిశ్చితార్ధం..!