
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఇటీవలే 20 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అందులో తన పెళ్లి గురించి సైతం ఆయన ప్రస్తావించారు. లావణ్యను ప్రేమ వివాహం చేసుకున్న పూరీ.. తమ ఇద్దరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో వివరించారు.
”నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేసే సమయంలో ప్రేమలో పడ్డాను. ఎలాగైనా లావణ్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. నా పెళ్లి అచ్చు మూవీ స్టైల్‌లో జరిగింది. అప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అలాంటి సమయంలో నా స్నేహితులు నాకు చాలా సహాయం చేశారు. ఝాన్సీ నా కోసం తాళిబొట్టు తీసుకొచ్చింది. హేమ పెళ్లి బట్టలు తెచ్చింది. నా ఫ్రెండ్స్ గెస్ట్‌ల కోసం కూల్‌డ్రింక్స్ తీసుకొచ్చారు. ఎర్రగడ్డ దేవాలయంలో నా పెళ్లి జరిగింది” అని పూరీ వెల్లడించారు. కాగా గతేడాది ఇస్మార్ట్ శంకర్‌తో మంచి విజయం సాధించిన పూరీ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ తెలుగు, హిందీలో విడుదల కానుంది.
Read This Story Also: వీడియో పోస్ట్ చేసిన చిరు.. రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్