Anasuya: వయసు దాచుకోవాల్సిన అవసరం లేదు.. అసలు ఏజ్‌ ఎంతో చెప్పేసిన అందాల అనసూయ..

Anasuya: న్యూస్‌ యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి, స్టార్‌ యాంకర్‌గా ఎదిగారు ట్యాలెంటెడ్‌ అనసూయ. యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను తన చలాకీ మాటలతో ఆకట్టుకునే అనసూయ, సినిమాల్లోనూ తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తున్నారు...

Anasuya: వయసు దాచుకోవాల్సిన అవసరం లేదు.. అసలు ఏజ్‌ ఎంతో చెప్పేసిన అందాల అనసూయ..
Anasuya

Updated on: Feb 19, 2022 | 5:27 PM

Anasuya: న్యూస్‌ యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి, స్టార్‌ యాంకర్‌గా ఎదిగారు ట్యాలెంటెడ్‌ అనసూయ. యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను తన చలాకీ మాటలతో ఆకట్టుకునే అనసూయ, సినిమాల్లోనూ తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తున్నారు. ‘ఎప్పుడొచ్చామన్నది కాదు’ అన్నట్లు లేటుగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన అనసూయ వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక సినిమాలు, బుల్లి తెర షోలతో నిత్యం ప్రేక్షకులకు టచ్‌లో ఉండే అందాల అనసూయ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫోటోలను పోస్ట్‌ చేస్తూ టన్నుల కొద్ది లైక్‌లను తన ఖాతాలో వేసుకుంటుంటారు. కొన్ని సందర్భాల్లో అనసూయ పోస్ట్‌ చేసే ఫోటోలు కాంట్రవర్సీకి కూడా దారి తీసిన సందర్భాలు ఉన్నాయి.

అయితే అనసూయ పోస్ట్ చేసే ఫోటోలు కాకుండా, ఆమె పోస్ట్‌లకు కొందరు నెటిజన్లు చేసే కామెంట్లు కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. తనపై కొందరు చేసే అభ్యంతకరమైన కామెంట్స్‌పై కూడా అనసూయ ఘాటుగా స్పందిస్తూ.. తగ్గేదేలే అన్నట్లు కౌంటర్‌ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ వయసుపై ప్రచురితమైన ఓ వార్త కథనంపై తనదైన శైలిలో స్పందించారు అనసూయ. ఇంతకీ విషయమేంటంటే.. ‘అనసూయ 40 ఏళ్ల వయసులోనూ.. ఎక్స్‌పోజింగ్‌కు వెనుకడుగు వేయదంటూ’ ఓ వార్త ప్రచురితమైంది.

ఈ విషయం కాస్త అనసూయ దృష్టికి వచ్చింది. దీంతో దీనిపై అనసూయ ఘాటుగా స్పందిస్తూ.. ‘నేను 40 ఏళ్లు కాదు, నా వయసు 36 ఏళ్లు. వయసు అనేది పెరుగుతూనే ఉంటుంది, ఆ నిజాన్ని దాచుకోవాల్సిన అవసరం నాకు లేదు’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా సదరు వార్త రాసిన వారిని ఉద్దేశిస్తూ.. ‘మీరు మీ పనిని నిజాయితీతో, విలువలతో చేయండి. గుడ్‌ లక్‌’ అంటూ హితవు పలికారు అనసూయ. ఇలా తనపై వచ్చిన నెగిటివ్‌ కామెంట్‌పై కూడా అనసూయ ఎంతో హుందాగా స్పందించారు.

Also Read: Hyderabad: ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణపై దాడికి యత్నం.. ఎందుకంటే..?