అనసూయకు మరో క్రేజీ ఆఫర్‌.. మాస్‌రాజా సినిమాలో..!

మాస్‌రాజా రవితేజ, రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఖిలాడిలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా

అనసూయకు మరో క్రేజీ ఆఫర్‌.. మాస్‌రాజా సినిమాలో..!

Edited By:

Updated on: Nov 11, 2020 | 10:11 AM

Anasuya Bharadwaj Ravi Teja: మాస్‌రాజా రవితేజ, రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఖిలాడిలో నటించబోతున్న విషయం తెలిసిందే. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఇక ఇందులో రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తుండగా.. ఆయన సరసన డింపుల్‌ హయతీ, మీనా చౌదరి రొమాన్స్ చేయబోతున్నారు. ( కోడలిగా మాకు హారిక ఓకే: అభిజిత్‌ తల్లిదండ్రులు)

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం హాట్ యాంకర్ అనసూయను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. పాత్ర నచ్చడంతో అనసూయ డేట్లు ఇచ్చినట్లు సమాచారం. కాగా ఇప్పటికే కృష్ణవంశీ రంగమార్తండలో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే చిరంజీవి ఆచార్య, అల్లు అర్జున్ పుష్పలోనూ ఆమె నటించబోతున్నట్లు టాక్‌. మొత్తానికి వరుస సినిమాలతో అనసూయ బిజీగా మారనున్నట్లు తెలుస్తోంది. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,196 కొత్త కేసులు.. 5 మరణాలు)