AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHA: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. ఆకట్టుకుంటోన్న రొమాంటిక్‌, కామెడీ టీజర్‌

రీసెంట్‌గా విడుదలైన ‘మైడియర్ దొంగ’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అభినవ్ గోమటం రోల్‌ నవ్వులు పూయిస్తున్నాయి. షాలిని కొండెపూడి పాత్ర కూడా అభినవ్ పాత్రను దొంగ అని పిలుస్తూ చేసే కామెడీ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో ఇంత కామెడీ ఉంటే, ఫుల్ లెంగ్త్‌ మూవీలో ఇంకెలాంటి కామెడీ సీన్స్‌ ఉంటాయో ప్రత్యేకంగా..

AHA: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. ఆకట్టుకుంటోన్న రొమాంటిక్‌, కామెడీ టీజర్‌
My Dear Donga
Narender Vaitla
|

Updated on: Mar 04, 2024 | 6:47 PM

Share

ఇండియా నెంబర్ వన్ లోకల్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో 100 శాతం వినోదాన్ని అందిస్తూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రతీ వారం కొత్త కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తుతోన్న ఈ ఆహాలో తాజాగా సరికొత్త వెబ్ ఫిల్మ్ ‘మై డియర్ దొంగ’ త్వరలోనే సందడి చేయనుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను టీమ్ విడుదల చేసింది. అభినవ్ గోమటం, షాలిని కొండెపూడి ప్రధాన తారాగణంగా నటించిన ఈ ఒరిజినల్‌ మూవీని ఆహా, కేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించాయి. బి.ఎస్.సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించారు. స్త్రీ సాధికారతను తెలియజేసేలా రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని షాలిని కొండెపూడి రచించటం విశేషం.

రీసెంట్‌గా విడుదలైన ‘మైడియర్ దొంగ’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అభినవ్ గోమటం రోల్‌ నవ్వులు పూయిస్తున్నాయి. షాలిని కొండెపూడి పాత్ర కూడా అభినవ్ పాత్రను దొంగ అని పిలుస్తూ చేసే కామెడీ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో ఇంత కామెడీ ఉంటే, ఫుల్ లెంగ్త్‌ మూవీలో ఇంకెలాంటి కామెడీ సీన్స్‌ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘మైడియర్ దొంగ’కు సంబంధించిన టీజర్ లాంచ్, పోస్టర్ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. దీంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. 1.24 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌ ఆకట్టుకుంటోంది.

‘మై డియర్ దొంగ’ కచ్చితంగా లాఫింగ్ థెరఫీని అందించే సినిమాగా అలరించనుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. దీనికి అభినవ్ గోమటం, షాలిని కొండెపూడి, దివ్య శ్రీపాద తమదైన శైలిలో కామెడీ టాలెంట్ చూపిస్తున్నారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే అత్యుత్తమమైన చిత్రంగా అలరించనుందనటంలో సందేహం లేదు. దీంతో ‘మై డియర్ దొంగ’ సినిమాను ఎప్పుడెప్పుడు ఆహా విడుదల చేస్తుందా అని రిలీజ్ డేట్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..