సమ్మర్‌కి పర్‌ఫెక్ట్ వీడ్కోలు చెప్పేందుకు సినీ రంగం సిద్ధమవుతోంది. ఇటు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా వస్తోంది ఈ వారంలోనే కావడం విశేషం. జూన్ 16వ తేదీన థియేటర్లలో సందడి చేసేందుకు ఈ సినిమా సిద్ధమైంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ,మలయాళ భాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఓటీటీల్లోనూ ఈ వారం పలు ఆసక్తికరమైన చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఈ వారం ప్రేక్షకులను ఓటీటీలో అలరించనున్న సినిమాలు/వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేయండి..
* నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 11వ తేదీన అడైమగై కాలం (తమిళం), జూన్ 16వ తేదీన ఎక్స్‌ట్రాక్షన్ 2 (హాలీవుడ్) స్ట్రీమింగ్ కానుంది.
* అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 15వ తేదీన జీ కర్దా (హిందీ), జూన్ 16వ తేదీన రావణకొట్టం (తమిళం) స్ట్రీమింగ్ కానుంది.
* డిస్నీ+హాట్‌స్టార్‌లో జూన్ 14వ తేదీన ఫుల్ కౌంట్ (కొరియన్ సిరీస్), జూన్ 16వ తేదీన షెవలియర్ (హాలీవుడ్), జూన్ 17వ తేదీన బిచ్చగాడు2 (తమిళం)తో పాటు జూన్ 15వ తేదీ నుంచి సైతాన్ (తెలుగు సిరీస్) స్ట్రీమింగ్ కానుంది.
* సోనీలివ్ ఓటీటీలో జూన్ 16వ తేదీన ఫర్హానా (తమిళ చిత్రం) జూన్ 16వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.
* జియో సినిమా వేదికగా జూన్ 15న తేదీన రఫూచక్కర్ (హిందీ సిరీస్), జూన్ 16వ తేదీన ఐ లవ్ యూ (హిందీ సినిమా) స్ట్రీమింగ్ కానుంది.
* ఈటీవీ విన్ ఓటీటీలో జూన్ 16 నుంచి కనులు తెరిచినా కనులు మూసినా సినిమా స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..