AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పుష్ప’ కోసం బన్నీ మరో కీలక నిర్ణయం..!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ 'పుష్ప'లో నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'పుష్ప' కోసం బన్నీ మరో కీలక నిర్ణయం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 24, 2020 | 4:46 PM

Share

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ‘పుష్ప’లో నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా., దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ మూవీ తెరకెక్కుతుండగా.. ఇందు కోసం బన్నీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారట.

ఇప్పటికే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చిత్తూరు యాసను ప్రత్యేకంగా నేర్చుకున్న విషయం తెలిసిందే. ఇక హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోని యాసలను నేర్చుకొని.. అన్ని భాషల్లోనూ తానే సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తున్నారట. బన్నీ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ఇదే కాగా.. ఈ సినిమాతో అన్ని వర్గాల వారికి మరింత దగ్గరవ్వాలనుకుంటున్నారట స్టైలిష్ స్టార్. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే జూన్‌ నుంచి షూటింగ్‌లు చేసుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమతులు ఇచ్చింది. కానీ షూటింగ్‌ విషయంలో పుష్ప టీమ్‌ అంత తొందరపడటం లేదట. కథానుగుణంగా ఈ సినిమా ఎక్కువ భాగం అడవులు, గిరిజన గ్రామాల్లో షూటింగ్‌ చేయాల్సి ఉండగా.. ప్రాధాన పాత్రాధారులకు ఇబ్బంది లేకుండా ఉండాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. కాగా సుకుమార్‌, బన్నీ కాంబోలో తెరకెక్కబోతున్న మూడో చిత్రం పుష్ప కాగా.. ఈ మూవీపై అటు అభిమానుల్లోనూ, ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: సైబర్ బెదిరింపులు.. నటి, ప్రముఖ కుస్తీ క్రీడాకారిణి ఆత్మహత్య..!

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!