స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న చిత్రం అల వైకుంఠపురంలో. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ వైపు షూటింగ్‌ను కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తొలి పాటగా వచ్చిన సామజవరగమన యూట్యూబ్‌లో ఇంకా దూసుకుపోతుండగా.. తాజాగా రాములో రాములా అనే రెండో పాట రిలీజ్ అయ్యింది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ పాట కూడా యూట్యూబ్‌లో రికార్డులను బ్రేక్ చేస్తోంది.
24 గంటల్లో 8.3 మిలియన్ల (83 లక్షల) వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. అంతేకాదు సౌత్‌లో ఈ రికార్డు సృష్టించిన మొదట పాట ఇదే కావడం విశేషం. అలాగే లైక్‌ల విషయంలోనూ రాములో రాములా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ పాటకు 3లక్షల 40 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. తమన్ మాస్ బీట్.. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ వాయిస్‌లు ఈ పాటకు మెయిన్ అస్సెట్‌గా నిలిచాయి. దీంతో యూత్‌ను రాములో రాముల విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. టబు, జయరామ్, నివేథా పేతురాజ్, నవదీప్, సుశాంత్, సునీల్, మురళీ శర్మ, సచిన్ కేడ్కర్ తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
MOST VIEWED SOUTH INDIAN SONG in 24 hours . THANK YOU ALL … for all the love . #AlaVaikunthapurramuloo #RamulooRamula pic.twitter.com/V0sKyNSx10
— Allu Arjun (@alluarjun) October 28, 2019