రాష్ట్రపతిగా.. మెగాస్టార్ చిరంజీవి!

| Edited By:

Dec 29, 2019 | 4:15 PM

రాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి అయితే ఎలా ఉంటుంది. ఏంటి షాకయ్యారా? ఊహకే విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం కావాలని ఒకరు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ సంపాదించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సంకల్పం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు అని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. చిరంజీవికి టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ వుంది. ఆయన గురించి.. ఆయన నటన గురించి […]

రాష్ట్రపతిగా.. మెగాస్టార్ చిరంజీవి!
Follow us on

రాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి అయితే ఎలా ఉంటుంది. ఏంటి షాకయ్యారా? ఊహకే విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం కావాలని ఒకరు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ సంపాదించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సంకల్పం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు అని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. చిరంజీవికి టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ వుంది. ఆయన గురించి.. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆయన నటావిశ్వరూపానికి 2006 జనవరిలో భారత ప్రభుత్వం తరుపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్.. చిరంజీవికి ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని, నవంబర్ 2006లో డాక్టరేట్‌ని ఇచ్చి గౌరవించారు.

సినీ కెరీర్‌నే కాకుండా.. ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు చిరు. అయితే.. కొన్ని కారణాలతో ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇంతకీ చిరంజీవిని రాష్ట్రపతిగా చూడాలనుకుంటోన్న వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నారా? చిరు.. బావమరిది అల్లు అరవింద్. అయితే ఇది రీల్ లైఫ్‌లో కాదు.. రియల్ లైఫ్‌లో. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అల్లు అరవింద్. ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు ఏకంగా.. రాష్ట్రపతి పదవిలో చిరంజీవి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. ‘చిరంజీవిని ఇంకా ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా.. చిరు రాజకీయాల్లో ఏ స్థాయికి వెళ్తారనేది ఊహించలేదు కానీ.. ఆయన్ని ప్రెసిడెంట్ ఆఫ్‌ ఇండియా చూడాలనేది నా డ్రీమ్ అని’ సమాధానమిచ్చారు అల్లు అరవింద్.

అయితే.. రాష్ట్రపతి పదవి అనేది.. అత్యంత రాజ్యాంగబద్ధమైన పెద్ద పదవి. తల పండిపోయిన రాజకీయ నేతలకు మాత్రమే అలాంటి గొప్ప అవకాశం దక్కుతుంది. మరి చిరంజీవి లాంటి వ్యక్తికి ఇంత పెద్ద అవకాశం దక్కుతుందా? మరి రాష్ట్రపతిగా చిరంజీవి ఫిట్ అవుతారా..? ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరి ఇదెలా సాధ్యం? ముఖ్యమంత్రి పదవి కాదు.. ప్రధాని మంత్రి పదవి కాదు.. ఏకంగా చిరంజీవి రాష్ట్రపతి అనడం పలు వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. అయితే చిరంజీవి లాంటి వ్యక్తులకు ఇలాంటి పదవి దక్కడంలో అతిశయోక్తి లేదు. అయినా.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. కాబట్టి ఈ పదవి ఆయనకు దక్కదని అనుకోలేము.