బాలీవుడ్ మోస్ట్ క్యూట్ జంటల్లో ఒకరైన అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌లు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ముంబైలోని రియలన్స్ హాస్పిటల్‌లో అలియా నవంబర్ 6వ తేదీన బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అలియా తన కూతురుతో సరదాగా గడుపుతోంది. ట్రిపులార్ సినిమాలో సీత పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువైందీ అలియా. ఇక బ్రహ్మస్త్ర సినిమాలో అలియా, రణ్ బీర్ కలిసిన నటించి మెప్పించిందీ జంట.
ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట తమ చిన్నారి పేరును ప్రపంచానికి చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. అయితే తమ బిడ్డ పేరును ప్రకటించిన విధానం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. యూనీసెఫ్ లోగోతో ఉన్న ఓ జెర్సీపై కూతురు పేరును ప్రింట్ చేసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ సమయంలో ఇద్దరు పాపను ఆప్యయంగా లాలిస్తున్నారు. అయితే పాప మొహాన్ని మాత్రం కనిపించకుండా చూసుకున్నారు. అలియా, రణ్‌బీర్‌లు తమ గారాల పట్టికి ‘రాహా’ అనే పేరును ఖరారు చేశారు.
ఇంతకీ రాహా అంటే అర్థం ఏంటనేగా మీ సందేహం. ఈ విషయాన్ని వివరిస్తూ ఓ క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ‘రాహా (తన దాదినే ఈ పేరును సూచించింది). రాహా అనే పేరుకు చాలా అందమైన అర్థాలు ఉన్నాయి. రాహా అంటే స్వచ్ఛమైన దైవిక మార్గం. స్వాహిలిలో దీనికి ఆనందం అని అర్థం. సంస్కృతంలో రాహా అంటే ఒక వంశం, బంగ్లాలో విశ్రాంతి, అరబిక్‌లో శాంతి, ఆనందం, స్వేచ్ఛ. మా జీవితంలోకి సంతోషాన్ని తీసుకొచ్చినందుకు నీకు థ్యాంక్యూ రాహా’ అని రాసుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..