Ali – Pawankalyan: అలీ కూతురు పెళ్లికి పవన్‌ ఎందుకు హాజరుకాలేదు.? అలీ చెప్పిన సమాధానం ఏంటంటే..

|

Dec 02, 2022 | 8:56 AM

నటుడు అలీ కూతురు వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. నవంబర్‌ 27వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన దిగ్గజ తారంలతా ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌..

Ali - Pawankalyan: అలీ కూతురు పెళ్లికి పవన్‌ ఎందుకు హాజరుకాలేదు.? అలీ చెప్పిన సమాధానం ఏంటంటే..
Ali - Pawan Kalyan
Follow us on

నటుడు అలీ కూతురు వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. నవంబర్‌ 27వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన దిగ్గజ తారంలతా ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. అలీ కూతురు వివాహానికి గైర్హాజరు కావడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. పవన్‌, అలీ మంచి క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అనే విషయం తెలిసిందే. అలీ నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో అలీ పాత్ర ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి స్నేహితుడి కూతురు పెళ్లికి పవన్‌ హాజరుకాకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల సమయంలో అలీ వైసీపీ పార్టీకి మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తర్వాత అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించారు. ఈ కారణంతోనే పవన్‌కు, అలికి మధ్య విబేధాలు వచ్చాయని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. అలీ కూతురు వివాహానికి హాజరుకాకపోవడానికి కూడా ఇదే కారణమంటూ సోషల్‌ మీడియా కోడై కూసింది. దీంతో ఈ విషయంపై అలీ ఎట్టకేలకు స్పందించారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన సమయంలో పవన్‌ తన కూతురు పెళ్లికి గైర్హాజు కావడంపై క్లారిటీ ఇచ్చారు.

ఈ విషయమై మాట్లాడిన అలీ.. ‘రామోజీ ఫిల్మిం సిటీలో షూటింగ్‌ సమయంలో పవన్‌తో పాటు చిత్ర యూనిట్ అందరికీ శుభలేఖ ఇచ్చాను. అయన కూడా వివాహానికి వస్తాను అని చెప్పారు. ఆ క్రమంలోనే అయన సెక్యూరిటీ సిబ్బంది కూడా వచ్చి రూట్ మ్యాప్ చూసుకున్నారు. కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో అయన రాలేకపోయారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అయన ఫోన్‌లో మాట్లాడారు. అల్లుడు, కూతురు ఇంట్లో ఉన్నప్పుడు చెప్పమని, తానే నేరుగా ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పారు’ అని తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..