Alekhya Chitti Pickels: బిగ్‏బాస్ షోకు వెళ్లాలని ఉంది.. కానీ.. అలేఖ్య చిట్టి సిస్టర్ క్లారిటీ..

గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు అలేఖ్య చిట్టి పికిల్స్ నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారంలో విజయవంతగా సాగింది. కానీ ఒక్క వాయిస్ మెసేజ్‏తో వీరి బిజినెస్ దెబ్బతినడమే కాకుండా నెట్టింట వీరిపై దారుణంగా ట్రోల్స్ జరుగుతున్నాయి.

Alekhya Chitti Pickels: బిగ్‏బాస్ షోకు వెళ్లాలని ఉంది.. కానీ.. అలేఖ్య చిట్టి సిస్టర్ క్లారిటీ..
Alekhya Chitti Pickles

Updated on: Apr 11, 2025 | 1:40 PM

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు మారుమోగుతుంది. ఒక్క వాయిస్ మెసేజ్‏తో ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు అక్కాచెల్లేళ్లపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. పచ్చళ్ల రేట్స్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయని అడిగినందుకు అతడిని బూతులు తిడుతూ వాయిస్ మెసేజ్ పంపించారు. దీంతో ఒళ్లుమండిన ఆ కస్టమర్ ఆ వాయిస్ మెసేజ్ నెట్టింట షేర్ చేయడంతో నెటిజన్స్ వీరిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అమ్మాయిలు ఈ రేంజ్ లో బూతులు తిడతారా అంటూ ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సదరు కస్టమర్‏కు క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేసినప్పటికీ ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు సిస్టర్స్ ప్రతి వీడియోను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారం కంటే ఎక్కువగా ట్రోలింగ్ తో ఇప్పుడు వీరి పేరు నెట్టింట వైరలవుతుంది. నిజానికి ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఇన్ స్టా, యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇదిలా ఉంటే.. అలేఖ్య చిట్టి పికిల్స్ ముగ్గురు అక్కాచెల్లేళ్లకు బిగ్ బాస్ 9లోకి ఛాన్స్ వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా కొన్ని రోజులుగా నెట్టింట ట్రెండింగ్ అవుతున్న ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఒకరిని బిగ్ బాస్ నిర్వాహకులు సెలక్ట్ చేశారని టాక్ నడిచింది. అంతేకాదు.. నాన్ వెజ్ పచ్చళ్లు ప్రమోట్ చేస్తూ మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ కలిగి ఉన్న రమ్య బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తుందని నెట్టింట ప్రచారం నడిచింది. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది అలేఖ్య చిట్టి పికిల్స్ అక్కాచెల్లేళ్లలో ఒకరైన సుమ. తాజాగా ఈ రూమర్స్ పై స్పందిస్తూ ఓ వీడియోనూ రిలీజ్ చేసింది.

అందులో సుమ మాట్లాడుతూ.. అలేఖ్య సిస్టర్స్ లో ఒకరు బిగ్ బాస్ లోకి ఎంటర్ అవుతున్నారని.. భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలిపింది. కొన్ని రోజుల క్రితం తాను యూట్యూబ్ లో ఓ వీడియో చేశానని.. అందులో తనకు బిగ్ బాస్ షోకి వెళ్లాలని కోరిక ఉందని.. ఛాన్స్ వస్తే కచ్చితంగా వెళ్తానని చెప్పానని.. ఇప్పుడు ఆ వీడియోను పట్టుకుని బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని వాపోయింది. తమకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి ఫోన్స్ రాలేదని.. ఆ వార్తలలో అసలు నిజం లేదని అన్నారు సుమ. అయితే ఇప్పుడు సుమ షేర్ చేసిన వీడియోపై విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?