‘అల’కు సెన్సార్ పూర్తి.. ‘సరిలేరు’ దారిలోనే..!

అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. ఇక ఈ చిత్ర నిడివిని గం.2.45ని.లకు ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన చిత్ర యూనిట్.. సంక్రాంతి పండుగకు సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. […]

అలకు సెన్సార్ పూర్తి.. సరిలేరు దారిలోనే..!

Edited By:

Updated on: Jan 03, 2020 | 5:47 PM

అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. ఇక ఈ చిత్ర నిడివిని గం.2.45ని.లకు ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన చిత్ర యూనిట్.. సంక్రాంతి పండుగకు సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే సరిలేరు నీకెవ్వరు దారిలోనే ఈ సినిమా కూడా విడుదల తేదిని ప్రకటించకపోవడం గమనర్హం. దీంతో ‘అల వైకుంఠపురములో’ విడుదల తేదీపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని అటు మహేష్, ఇటు బన్నీ భావిస్తున్నారు. ఈ క్రమంలో కేవలం టాక్ మాత్రమే కాదు, కలెక్షన్లలోనూ తమ సత్తాను చూపించాలని వారిద్దరు ప్లాన్ వేసుకున్నారు. అయితే విడుదల తేది విషయంలో ఈ రెండు టీమ్‌ల మధ్య ఇంకా సైలెంట్ వార్ కొనసాగుతోంది. మొదట ఒక రోజు గ్యాప్‌తో రావాలని ఈ రెండు టీమ్‌లు భావించినప్పటికీ.. ఇప్పుడు మాత్రం విడుదల తేదీపై ఎవ్వరూ వెనక్కి తగ్గమంటున్నారు. రెండు రోజుల ముందే రావాలని ‘అల’ టీమ్ అనుకుంటోన్న నేపథ్యంలో.. ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా అదే రోజు రావాలని ప్లాన్ చేసుకుంటోంది. ఈ విషయంలో రెండు టీమ్‌ల మధ్య ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మరి రెండు సినిమాల విడుదల తేదీపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

కాగా మరోవైపు ఈ మూవీకి సెన్సార్ పూర్తి కావడంతో ప్రమోషన్లలో మరింత వేగాన్ని పెంచనున్నారు ‘అల’ టీమ్. ఈ క్రమంలో ఇప్పటికే ఈ నెల 6న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్రకటించిన బన్నీ టీమ్.. దాన్ని గ్రాండ్‌గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందులో ప్రధాన తారగణం మొత్తం పాల్గొననున్నారు. ఇక ఈ వేడుకకు పవన్ గానీ.. చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరు గానీ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.