Akshay Kumar’s Bell Bottom : ఓటీటీ లో రిలీజ్ కానున్న అక్షయ్ కుమార్ ‘బెల్‌‌‌‌‌‌బాటమ్’ సినిమా..?

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వరసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. మిగతా హీరోలు ఏడాదికి ఒకటో, రెండో సినిమాలు చేస్తే గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో అక్షయ్ తన దైన స్పీడుతో దూసుకెళ్తున్నాడు.

Akshay Kumars Bell Bottom : ఓటీటీ లో రిలీజ్ కానున్న అక్షయ్ కుమార్ బెల్‌‌‌‌‌‌బాటమ్ సినిమా..?

Updated on: Jan 21, 2021 | 5:39 AM

Akshay Kumar’s Bell Bottom  : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వరసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. మిగతా హీరోలు ఏడాదికి ఒకటో, రెండో సినిమాలు చేస్తే గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో అక్షయ్ తన దైన స్పీడుతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ‘పృథ్వీరాజ్’, ‘బచ్చన్ పాండే’, ‘బెల్ బాటమ్’ సినిమాలు చేస్తున్నాడు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ‘బెల్ బాటమ్’ చిత్రానికి రంజిత్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా ‘బెల్‌బాటమ్‌’  ఓటీటీలో  విడుదల కానుందని బాలీవుడ్‌ టాక్‌. గతంలో అక్షయ్ నటించిన లక్ష్మీ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే  బెల్ బాటమ్ కూడా ఓటీటీలో విడుదల అవుతునంటున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు చర్చలు జరుగుతున్నాయట. ముందుగా ఈ మూవీని 2021 ఏప్రిల్ 2న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఓటీటీలో రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి :

Actor Salman Khan: వారికి క్షమపణలు చెప్పిన సల్మాన్ ఖాన్.. అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడుగా..