Akshay Kumar: బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్ కుమార్‌కు భారతీయ పౌరసత్వం.. ఆ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసుకున్న హీరో..!

Akshay Kumar gets Indian citizenship: 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఆయనకు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వాన్ని ఇచ్చారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ ట్వీట్‌తో తెలియజేశారు. ఈ మేరకు ఫోటోను షేర్ చేస్తూ స్వాతంత్ర్య దినోత్స శుభాకాంక్షలు తెలిపారు.

Akshay Kumar: బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్ కుమార్‌కు భారతీయ పౌరసత్వం.. ఆ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసుకున్న హీరో..!
Akshay Kumar

Updated on: Aug 15, 2023 | 5:40 PM

Akshay Kumar gets Indian citizenship: 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఆయనకు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వాన్ని ఇచ్చారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ ట్వీట్‌తో తెలియజేశారు. ఈ మేరకు ఫోటోను షేర్ చేస్తూ స్వాతంత్ర్య దినోత్స శుభాకాంక్షలు తెలిపారు. అక్షయ్ కుమార్ పూర్తిస్థాయి భారతీయుడు కాదు. ఆయన కెనడియన్. కెనడా పౌరసత్వం ఉందాయనకు. కెనడా ప్రభుత్వం అందించిన పాస్‌పోర్ట్‌తోనే భారత్‌లో నివసిస్తోన్నారు. కొద్దిరోజుల కిందటే తన కెనడా పాస్‌పోర్ట్‌ను కూడా రెన్యూవల్ చేయించుకున్నారు. దీనితో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. భారత్‌లో ఉంటూ భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉండకపోవడాన్ని చాలామంది తప్పుపట్టారు. ఈ విమర్శలకు ఆయన సమాధానాలు, వివరణలను ఇస్తూ వచ్చారు. పౌరసత్వం లేనంత మాత్రాన తాను భారతీయుడిని కాదనుకోవట్లేదంటూ చెబుతూ వచ్చారు. తాను ఇక్కడే స్థిరపడ్డానని, ఇక్కడే సంపాదిస్తోన్నానని, అందులో కొంతమొత్తాన్ని సమాజానికి తిరిగి చెల్లిస్తోన్నానంటూ చెప్పుకొచ్చారు. తాజాగా, అక్షయ్ కుమార్‌కు భారతీయ పౌరసత్వం లభించింది. ఆయన పూర్తిపేరు అక్షయ్ హరిఓం భాటియా పేరు మీద భారతీయ పౌరసత్వం మంజూరయింది. దీంతో అక్షయ్ కుమార్ కెనడా పాస్‌పోర్ట్‌ను రద్దు చేసుకున్నారు.

అప్పట్లో అక్షయ్ కుమార్ ఏమన్నారంటే..?

కాగా.. తాను కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాలను గతంలో అక్షయ్‌ కుమార్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 1990ల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని.. వరుసగా 15 సినిమాలు పరాజయం పాలయ్యాయంటూ తెలిపారు. కెనడాలో ఉన్న స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నానని.. అందుకోసమే పాస్‌పోర్ట్‌కు అప్లయ్‌ చేశానని.. అప్పుడే కెనడా పాస్‌పోర్ట్‌ వచ్చినట్లు వివరించారు. అంతలోనే అప్పటికే నటించిన రెండు సినిమాలు భారత్‌లో ఘన విజయం సాధించడంతో అక్కడికి వెళ్లాల్సిన అవసరం రాలేదంటూ తెలిపారు. ఈ క్రమంలోనే పాస్‌పోర్ట్‌ విషయం మరిచిపోయా. అందుకే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నానంటూ అని అక్షయ్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..