Akshay Kumar: 260 కోట్ల ప్రైవేట్‌ జెట్‌ కొనుగోలుపై హీరో రియాక్షన్‌ ఇదే ‘పాపం.. కొంత మంది బ్రెయిన్‌ ఇంకా ఎదిగినట్టు లేదు’

బాలీవుడ్‌ స్టార్‌ హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అక్షయ్‌ రెమ్యునరేషన్‌ కూడా భారీగానే డిమాండ్‌ చేస్తారట. ఇక స్టార్స్ లైఫ్ ఎంత విలాసవంతంగా ఉంటుందో చెప్పనవసరం లేదు.  ఐతే ఆయన ఇటీవల రూ. 260 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌ని కొనుగోలు..

Akshay Kumar: 260 కోట్ల ప్రైవేట్‌ జెట్‌ కొనుగోలుపై హీరో రియాక్షన్‌ ఇదే పాపం.. కొంత మంది బ్రెయిన్‌ ఇంకా ఎదిగినట్టు లేదు
Akshay Kumar's Private Jet

Updated on: Oct 17, 2022 | 2:00 PM

బాలీవుడ్‌ స్టార్‌ హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అక్షయ్‌ రెమ్యునరేషన్‌ కూడా భారీగానే డిమాండ్‌ చేస్తారట. ఇక స్టార్స్ లైఫ్ ఎంత విలాసవంతంగా ఉంటుందో చెప్పనవసరం లేదు.  ఐతే ఆయన ఇటీవల రూ. 260 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌ని కొనుగోలు చేసినట్లు అకయ్ కుమార్ వెనుక జెట్‌ విమానం ఉన్న ఫొటోతో ఓ వెబ్‌సైట్‌ వార్తాకథనాలు రాసింది.  అప్పటి నుంచి ఈ వ్యవహారంపై పలు కథనాలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఐతే సదరు వార్తలపై ఆదివారం (అక్టోబర్‌ 16) అక్షయ్‌ కుమార్‌ సోషల్‌ మీడియా వేదికగా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ‘లయర్‌, లయర్‌.. ప్యాంట్స్‌ ఆన్‌ ఫైర్‌! చిన్నతనంలో దీన్ని విన్నా. ఐతే కొంతమంది ఇప్పటికీ ఎదగలేదు. అటువంటి వాళ్లను బయటకు తీసుకొచ్చే మూడ్‌ నాకు లేదు. నా గురించి లేనిపోని అబద్ధాలు రాస్తున్నారు. నేనే దానిని పిలుస్తాను. ఇక్కడ మీకోసం ప్యాంట్స్‌ ఆఫ్‌ ఫైర్‌ ఉంది’ అని తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు.

తన పోస్టు కింద ప్యాంట్స్‌ ఆఫ్‌ ఫైర్‌ అక్షయ్‌కుమార్‌ అనే హ్యష్‌ ట్యాగ్‌ జోడించాడు. కాగా ఓ సినిమా చిత్రీకరణ సమయంలో అక్షయ్‌కుమార్‌, వాణీకపూర్‌లు విమానం ముందు నిల్చొని దిగిన ఫొటో అని, నిరాధారమైన అబద్ధాలుగా పేర్కొంటూ సదరు వార్తలను ఖండించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, అక్షయ్ కుమార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భరుచా, నాసర్, సత్యదేవ్‌లతో కలిసి నటించిన ‘రామ్ సేతు’ మువీ విడుదలకు సన్నాహాలు చేస్తు్నారు. అభిషేక్ శర్మ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కానుంది. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఈ మువీ ట్రైలర్‌ పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో రామసేతు నిర్మాణాన్ని పరీలిస్తున్న అక్షయ్ కుమార్ నటన అందరినీ ఆకట్టుకుంది. రామ సేతు వారధి రహస్యాల నేపథ్యంలో ఈ మువీని తెరకెక్కించారు. ట్రైలర్‌కు మంచి స్పందనరావడంతో మువీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.