Most Eligible Bachelor: ప్రతిష్ఠాత్మకంగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఇందులో అక్కినేని అఖిల్, అందాల భామ పూజాహెగ్డే హీరో,హీరోయిన్‌గా నటిస్తున్నారు. భాస్కర్ సినిమా అంటే చాలు సకుంటుంబ సపరివార సమేతంగా చూడవచ్చు. ఎందుకంటే గతంలో ఆయన సినిమాలు చూస్తే తెలుస్తుంది. అయితే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర బృందం సన్నాహాలు చేశారు కానీ సాధ్యపడలేదు. దీంతో అఖిల్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. కానీ ఒక గుడ్ న్యూస్ మాత్రం తెలిపారు.
సినిమాను వేసవిలో విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో బ్యాచిలర్ సంక్రాంతి రేసులో లేనట్లే. అయితే వేసవికి వచ్చే సినిమాలతో పోటీ పడుతోంది. ఈ సినిమా ఇంకో షెడ్యూల్ చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ నెలాఖరుతో పూర్తయ్యే ఆ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. యువతరానికి నచ్చే అంశాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బ్యాచ్‌లర్‌గా అఖిల్ చేసే సందడి ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఛాయాగ్రహణం: ప్రదీశ్ ఎమ్.వర్మ అందిస్తున్నారు.
సంక్రాంతి బరిలో అక్కినేని యంగ్ హీరో.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఎప్పుడొస్తున్నాడంటే