Akhil Akkineni: ‘అయ్యగారు’ అనే పదం నా లైఫ్‌ను టేకోవర్‌ చేసేసింది.. అభిమానిపై పొగడ్తలు కురిపించిన అఖిల్‌..

Akhil Akkineni: ఓసారి గూగుల్‌లో 'అయ్యగారు' అని సెర్చ్‌ చేసి చూడండి.. థియేటర్‌ బయట రివ్యూ ఇస్తోన్న ఓ వ్యక్తి కనిపిస్తాడు. అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన 'హల్లో' చిత్రం చూసిన తర్వాత థియేటర్‌..

Akhil Akkineni: 'అయ్యగారు' అనే పదం నా లైఫ్‌ను టేకోవర్‌ చేసేసింది.. అభిమానిపై పొగడ్తలు కురిపించిన అఖిల్‌..
Akhil Ayyagaru

Akhil Akkineni: ఓసారి గూగుల్‌లో ‘అయ్యగారు’ అని సెర్చ్‌ చేసి చూడండి.. థియేటర్‌ బయట రివ్యూ ఇస్తోన్న ఓ వ్యక్తి కనిపిస్తాడు. అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన ‘హల్లో’ చిత్రం చూసిన తర్వాత థియేటర్‌ నుంచి బయటకు వచ్చి.. అఖిల్‌ను పొగిడిన వీరాభిమాని నాగ రాజే ఆ ఫోటోలో కనిపించే వ్యక్తి. ఒక్క వీడియోతో ఎంతో పాపులర్‌ అయ్యాడా అభిమాని. ఆ క్షణం నుంచి సోషల్‌ మీడియాలో ‘అయ్యగారు’ అనే పదం ట్రెండింగ్‌లా మారింది. ‘అయ్యగారే నెం 1’ అంటూ సదరు అభిమాని మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాను షేక్‌ చేశాయి, ఇప్పటికీ చేస్తున్నాయి కూడా. ఇదిలా ఉంటే తాజాగా ఏకంగా అఖిల్‌ కూడా ఆ అభిమాని గురించి ప్రస్తావించారు.

అఖిల్‌ హీరోగా తెరకెక్కిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ దసరా కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న అఖిల్‌.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా ఇన్‌స్టాలో ఓ అభిమాని అఖిల్‌ను.. ‘అయ్యగారు’ గురించి ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా నవ్విన అఖిల్‌ నాగరాజుపై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా అఖిల్‌ మాట్లాడుతూ.. ‘నాగరాజు మిమ్మల్ని ఒకసారి కలవాలి. మీ వీడియోలు చూశాను. మీరు నాకన్న ఫేమస్‌ అయ్యారు. మీరిచ్చిన ‘అయ్యగారు’ అనే పదం నాలైఫ్‌ని టేక్‌ఓవర్‌ చేసింది. ఈ పదాన్ని ఏకంగా మా సినిమాలో పెట్టేశారు. మీరు ఇంత పాపులర్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు క్షేమంగా ఉండండి, ఎప్పుడూ అదే ఉత్సాహాన్ని కలిగివుండండి. మీ ఆదరణ అభిమానానికి నా కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చారు అఖిల్‌.

Also Read: Chanakya Niti: ఇలాంటి శత్రువులతో జాగ్రత సుమీ.. అలాంటివారి పట్ల ఏమరపాటు అసలే వద్దు..

Viral Video: పాపం పోరడు.. కోతి చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు.. ఈ వీడియో చూస్తే గంటసేపు నవ్వు ఆగదంతే..

Indication of body moles: మీ శరీరంపై ఈ ప్రాంతాల్లో పుట్టుమచ్చలు ఉన్నాయా? అయితే ఈ రహస్యాలను తెలుసుకోండి..!

Click on your DTH Provider to Add TV9 Telugu