- Telugu News Photo Gallery Cinema photos Taapsee pannu latest saree photos goes viral on social media
Taapsee Pannu: ఎర్ర చీరలో వెర్రెక్కిస్తున్న కుర్ర భామ.. తాప్సీ అందానికి ఫిదా అవ్వాల్సిందే
. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తరువాత 2011లో, వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ఆడుకలం చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది..
Updated on: Nov 16, 2024 | 8:52 PM

మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ పన్ను. 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

తరువాత 2011లో, వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ఆడుకలం చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.. ఆ తర్వాత తాప్సీ తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ఈ బ్యూటీ 2013లో వరుణ్ ధావన్ చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

వస్తాడు నా రాజు, మిస్టర్ పర్‌ఫెక్ట్, సాహసం,ఆనందో బ్రహ్మ, మొగుడు లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తమిళ్‌లో కాంచన 2, వై రాజా వై, గేమ్ ఓవర్ సహా తమిళ చిత్రాల్లో నటించింది ఈ వయ్యారి భామ .

ఆతర్వాత హిందీకి చెక్కేసిన ఈ చిన్నది అక్కడ బేబీ, పింక్, ది ఘాజీ ఎటాక్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక నటిగా నిరూపించుకుంది. తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యింది ఈ చిన్నది.

ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనే నటించే తాప్సీ పన్ను ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లోనూ నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా ఎర్ర చీరలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.




