Aishwarya Rajesh : ‘డ్రైవర్ జమున’గా మారిన ఐశ్వర్య రాజేష్.. కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన బ్యూటీ

కౌసల్య కృష్ణ మూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ఐశ్వర్య రాజేష్.  ఐశ్వర్య నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు...

Aishwarya Rajesh : డ్రైవర్ జమునగా మారిన ఐశ్వర్య రాజేష్.. కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన బ్యూటీ

Updated on: Jan 11, 2021 | 7:46 PM

Aishwarya Rajesh : ‘కౌసల్య కృష్ణ మూర్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆతర్వాత క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫెమస్ లవర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

ఇప్పుడు ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు ‘డ్రైవ‌ర్ జ‌మున’‌ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య క్యాబ్ డ్రైవ‌ర్ గా న‌టిస్తోంది. పి కిన్ స్లిన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాకు గిబ్రాన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.. అంటూ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ఎస్ఈ చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐశ్వ‌ర్య‌రాజేశ్ ప్ర‌స్తుతం నానితో క‌లిసి ట‌క్ జ‌గ‌దీష్ సినిమాలో న‌టిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Master Movie : విడుదలకు సిద్ధమవుతున్న విజయ్ ‘మాస్టర్’.. కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు..

Chiru Father Venkata Rao Acted:మామగారితోనే కాదు తండ్రి తోనూ సిల్వర్ స్క్రీన్‌ను షేర్ చేసుకున్న మెగాస్టార్.. ఆ సినిమా ఏమిటో తెలుసా..!