రాములమ్మ తర్వాత.. కీర్తిసురేష్ దే ఆ ఘనత..

|

Aug 10, 2019 | 8:07 PM

నిన్న 66 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ఇండస్ట్రీ‌లు కూడా ఎక్కువ అవార్డులు దక్కించుకోవడం విశేషం. ఇక ఈసారి ఏకంగా 7 తెలుగు సినిమాలు వివిధ కేటగిరీలో అవార్డులు గెలుచుకున్నాయి. ఇందులో మహానటి సినిమా రెండు అవార్డులు పొందింది. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ నటి కేటగిరిల్లో ఈ సినిమా పురస్కారాలను దక్కించుకుంది. అయితే దాదాపు 28 ఏళ్ళ తర్వాత ఉత్తమ నటి అవార్డును తెలుగు […]

రాములమ్మ తర్వాత.. కీర్తిసురేష్ దే ఆ ఘనత..
Follow us on

నిన్న 66 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ఇండస్ట్రీ‌లు కూడా ఎక్కువ అవార్డులు దక్కించుకోవడం విశేషం. ఇక ఈసారి ఏకంగా 7 తెలుగు సినిమాలు వివిధ కేటగిరీలో అవార్డులు గెలుచుకున్నాయి.

ఇందులో మహానటి సినిమా రెండు అవార్డులు పొందింది. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ నటి కేటగిరిల్లో ఈ సినిమా పురస్కారాలను దక్కించుకుంది. అయితే దాదాపు 28 ఏళ్ళ తర్వాత ఉత్తమ నటి అవార్డును తెలుగు సినిమా సొంతం చేసుకోవడం గమనార్హం. 1990లో విజయశాంతి కర్తవ్యం సినిమాకు ఉత్తమ నటి అవార్డు పొందగా.. మళ్ళీ ఇన్నాళ్లకు ‘మహానటి’ సినిమా ద్వారా కీర్తి సురేష్ ఆ అవార్డు దక్కించుకుంది. కాగా తెలుగు సినిమాలకు అవార్డుల పంట పండడంతో ఏపీ ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.