‘ఎవరు’లో అడివి శేషు.. ప్రీ లుక్‌ విడుదల

విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటోన్న యంగ్ హీరో అడివి శేషు ‘ఎవరు’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆగష్టు 23న విడుదల కానున్న ఈ మూవీకి ఇప్పుడు ప్రమోషన్లను ప్రారంభించేశాడు అడవి శేషు. ఈ నేపథ్యంలో మొదటిసారిగా తన ప్రీ లుక్‌ను విడుదల చేసిన ఈ హీరో.. ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 11న రాబోతున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ చిత్రంలో విక్రమ్ వాసుదేవ్ అనే అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అడవి శేషు […]

‘ఎవరు’లో అడివి శేషు.. ప్రీ లుక్‌ విడుదల
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2019 | 12:32 PM

విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటోన్న యంగ్ హీరో అడివి శేషు ‘ఎవరు’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆగష్టు 23న విడుదల కానున్న ఈ మూవీకి ఇప్పుడు ప్రమోషన్లను ప్రారంభించేశాడు అడవి శేషు. ఈ నేపథ్యంలో మొదటిసారిగా తన ప్రీ లుక్‌ను విడుదల చేసిన ఈ హీరో.. ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 11న రాబోతున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ చిత్రంలో విక్రమ్ వాసుదేవ్ అనే అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అడవి శేషు కనిపించబోతున్నాడు.

కాగా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో రెజీనా హీరోయిన్‌గా కనిపించనుండగా.. నవీన్ చంద్ర, మురళీ శర్మ కీలక పాత్రలలో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను పీవీపీ బ్యానర్‌పై పర్ల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మిస్తున్నారు. వెంకట్ రాంజీ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.