Adipurush Director: ఓల్డ్ ట్వీట్‌తో అడ్డంగా బుక్కైన ఓంరౌత్.. దుమ్ము దులిపేస్తున్న నెటిజన్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే..

‘ఆదిపురుష్’.. ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్న సినిమా ఇది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా.. కృతి సనన్ సీతగా.. ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ సృష్టి్స్తూ భారీ కలెక్షన్లు రాబడుతోంది. డే వన్ రూ. 140 కోట్లు కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే, ఎప్పుడు విడుదల అవుతుందా? అని ప్రపంచం అంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ఈ సినిమా.

Adipurush Director: ఓల్డ్ ట్వీట్‌తో అడ్డంగా బుక్కైన ఓంరౌత్.. దుమ్ము దులిపేస్తున్న నెటిజన్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Om Raut

Updated on: Jun 17, 2023 | 7:26 PM

‘ఆదిపురుష్’.. ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్న సినిమా ఇది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా.. కృతి సనన్ సీతగా.. ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ సృష్టిస్తూ భారీ కలెక్షన్లు రాబడుతోంది. డే వన్ రూ. 140 కోట్లు కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే, ఎప్పుడు విడుదల అవుతుందా? అని ప్రపంచం అంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ఈ సినిమా.. విడుదల తరువాత మిశ్రమ స్పందనను అందుకుంటోంది.

సినిమాలో పాత్రదారుల నటనపై ప్రశంసలు వస్తున్నప్పటికీ.. సినిమాను తెరకెక్కించిన విధానంపై ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా డైరెక్టర్ ఓంరౌత్‌పై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. థియేటర్‌లో హనుమంతుడికి సీట్ కేటాయించిన సినిమా బృందం.. సినిమాను మాత్రం సరిగా చిత్రీకరించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. రావణాసురుడు, ఆంజనేయుడు, వానర సేనను చిత్రీకరించిన విధానంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో భారతీయత లోపించిందని, అసలు దర్శకుడు ఓంరౌత్ రామాయణాన్ని అధ్యయనం చేశాడా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ విమర్శలు ఇలా ఉంటే.. గతంలో హనుమంతుడిపై ఓంరౌత్ చేసిన కామెంట్.. ఇప్పుడు మరో వివాదాన్ని క్రియేట్ చేస్తోంది. ‘హనుమంతుడికి చెవులు వినిపించవా?’ అంటూ ఓంరౌత్ గతంలో ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆదిపురుష్‌లో హనుమంతుడిని, వానరసేను తప్పుగా చూపించాడని విమర్శిస్తూ.. గతంలో ఆయన చేసిన ట్వీట్ తాలూకు స్క్రీన్ షాట్‌ను రీపోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

2015లో హనుమాన్ జయంతిని ఎగతాళి చేస్తూ డైరెక్టర్ ఓంరౌత్ ట్వీట్ చేశాడు. ‘‘హనుమంతుడు ఏమైనా చెవిటివాడా? నేను నివాసం ఉంటున్న భవనంలోని ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారు. హనుమాన్ జయంతి రోజున వీధుల్లో పెద్ద పెద్ద శబ్ధాలతో పాటలు పెడుతున్నారు. పైగా ఇవన్నీ అసంబద్ధమైన పాటలే’’ అంటూ ఓంరౌత్ ట్వీట్ చేశాడు. ఈ కామెంట్‌ వివాదాస్పదం అవడంతో అప్పుడు వెంటనే తొలగించాడు. అయితే, ఆ పాత ట్వీట్ ఆదిపురుష్ సినిమా నేపథ్యంలో మరోసారి వైరల్ అవుతోంది. ట్విట్టర్ యూజర్ ఒకరు.. ఓంరౌత్ ట్వీట్‌కు సంబంధించి పాత స్క్రీన్ షాట్ షేర్ చేశారు. దాంతో ఓంరౌత్ తీరుపై మండిపడుతున్నారు నెటిజన్లు. మరి ఈ అంశం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.


మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..