Actress Sudha: పాన్ ఇండియా స్టార్ అయినా అంత వినయమా..? నా కాళ్లు పట్టుకుని అమ్మా అంటూ.. నటి సుధ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా ఎన్నో వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు నటి సుధ. ఇప్పటికీ సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుధ మాట్లాడుతూ.. ఓ స్టార్ హీరో నిరాడంబరత, పెద్దల పట్ల గౌరవం, పని పట్ల అంకితభావాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రముఖ నటి సుధా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన సుదీర్ఘ అనుభవాన్ని, పలువురు అగ్రనటులతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం, పెద్దల పట్ల ఆయనకున్న గౌరవం, నిరాడంబరతపై ప్రశంసలు కురిపించారు. పెద్ద ఎన్టీఆర్ తో మేజర్ చంద్రకాంత్ చిత్రంలో పని చేసిన తాను, అప్పటి చిన్న పిల్లవాడైన జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గర నుండి చూశానని తెలిపారు. బాద్షా చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పాటలో నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాల్యం గురించి మాట్లాడుతూ, చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లవాడిగా ఉండేవాడని, కార్లు కూడా చాలా వేగంగా నడిపేవాడని సుధా తెలిపారు. అయితే, ఇప్పుడు తను చాలా పరిణితి చెందిన వ్యక్తిగా మారారని, ఒక కుటుంబంలో ఎలా ఉండాలో ఆయనకు తెలుసని అన్నారు. అయినప్పటికీ, ఆయనలోని అల్లరి స్వభావం మాత్రం అలాగే ఉందని చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..
జూనియర్ ఎన్టీఆర్ నిరాడంబరతను వివరిస్తూ, బాద్షా పాట చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటనను పంచుకున్నారు. నైట్ షూట్ లో డాన్స్ చేస్తుండగా సుధా కాలు బెణికిందని, వెంటనే జూనియర్ ఎన్టీఆర్ పరుగున వచ్చి ఆమె కాలు పట్టుకుని స్ప్రే చేసి, ఆమెను ఓదార్చారని తెలిపారు. “అమ్మ మీరు అమ్మ లాంటి వాళ్ళు, మీకు ఇలా సేవ చేయడంలో తప్పులేదు” అని జూనియర్ ఎన్టీఆర్ అన్న మాటలు తనకెంతో ఆనందాన్నిచ్చాయని సుధా వివరించారు. అలాంటి వ్యక్తిత్వం, వినయం ఉన్నందునే జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారని ఆమె అన్నారు. చాలా మంది నటులు తన స్థాయిని చూసుకుని ఇలాంటి పనులు చేయరని, కానీ జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న ఈ గుణం అరుదైనదని సుధా గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..
సుధా తన కెరీర్ లో పలు కుటుంబాలకు చెందిన నటుల మూడు, నాలుగు తరాలతో పని చేయడం తనకొక అరుదైన అదృష్టంగా భావించారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి వంటి దిగ్గజ నటులతో పాటు, వారి వారసులైన జూనియర్ ఎన్టీఆర్, సుమంత్, సుశాంత్, అఖిల్, మహేష్ బాబు, రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్ వంటి వారితోనూ పనిచేశానని తెలిపారు. చిరంజీవి గ్యాంగ్ లీడర్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ చిన్న పిల్లాడని, కృష్ణ గారితో పని చేసినందున మహేష్ బాబును దగ్గర నుండి చూశానని అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు తో పని చేసిన తర్వాత సుమంత్, సుశాంత్, అఖిల్ తో కూడా పని చేయడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. “ఈ అదృష్టం చాలా తక్కువ మందికి దక్కుతుంది” అని ఆమె అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..
జూనియర్ ఎన్టీఆర్..

Sudha, Ntr
ఎక్కువ మంది చదివినవి : Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..
సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
