Indian Railways: తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు.. నెల రోజుల పాటు సర్వీసులు.. ఈ రూట్లల్లో వెళ్లేవారికి మంచి అవకాశం..
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు రైళ్ల షెడ్యూల్ వివరాలను ప్రకటించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి కూడా ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి. ఈ రైళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ, తెలంగాణ మీదుగా పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వీటిని ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే తిరుగుతున్న ఈ ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు గమనించి ఈ రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించింది. హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, డోన్, నిజామాబాద్ వంటి ప్రాంతాల మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ చూద్దాం.
చర్లపల్లి-షాలిమార్(08046) అక్టోబర్ 3 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ప్రతీ శనివారం , షాలిమార్-చర్లపల్లి(08045) అక్టోబర్ 2 నుంచి నవంబర్ 27 వరకు ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకొట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, భువనేశ్వర్, కటక్, బాలాసోర్, ఖరగ్ పూర్, సంత్రగాచి స్టేషన్లలో ఆగుతుంది. వీటిల్లో థర్డ్, సెకండ్ ఏసీ కోచ్‌లతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఇక కొయంబత్తూర్-జైపూర్(06181) అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ప్రతీ గురువారం, జైపూర్-కొయంబత్తూర్(06182) అక్టోబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కాట్పాడు, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, వడోదర స్టేషన్లలో ఆగుతుంది.
జొధ్ పూర్-చెన్నై బీచ్(04815) రైలు అక్టోబర్ 3 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ప్రతీ శనివారం, చెన్నై సెంట్రల్-జోధ్ పూర్(04816) అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 1 వరకు ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు జైపూర్, భోపాల్, నాగ్ పూర్, సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, బాపట్ల, చీరాల, నెల్లూరు, ఒంగోలు, గూడూరు మీదుగా చెన్నైకు వెళతాయి. ఇక కాన్పూర్ సెంట్రల్-బెంగళూరు(04131) రైలు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు, బెంగళూరు-కాన్పూర్(04132) అక్టోబర్ 7 నవంబర్ 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, చీరాల, బాపట్ల, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడు స్టేషన్లలో ఆగుతాయి.
