పనస తొనలు తిన్నాక గింజలు పడేస్తున్నారా?
17 September 2026
TV9 Telugu
TV9 Telugu
పనసపండు అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. దాని తియ్యటి రుచి, ప్రత్యేకమైన వాసన ఎంతో ఆకట్టుకుంటాయి
TV9 Telugu
అయితే పనసపండు తిన్న తర్వాత కొంతమంది గింజలను పడేస్తుంటారు. కానీ పనస గింజల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి
TV9 Telugu
వీటిలో ప్రొటీన్, ఫైబర్, ఒమేగా 3, ఒమేగా 6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్‌లు, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి
TV9 Telugu
పనస గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. దాంతో మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. వీటిల్లోని ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది
TV9 Telugu
పనస గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి
TV9 Telugu
ఇందులోని మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు గుండె ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు. అలాగే పనస గింజల్లో ఐరన్ కూడా ఉంటుంది
TV9 Telugu
ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల తయారీకి అవసరం. విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడవచ్చు
TV9 Telugu
మధుమేహం ఉన్నవారు పనస గింజలను ఉడికించి లేదా తక్కువ నూనెతో వండుకుని పరిమితంగా తీసుకోవచ్చు
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి