Sreeleela: ఫ్యాన్స్‌కు షాకిచ్చిన శ్రీలీల.. బిగ్ డే అంటూ ఫోటోస్ రివీల్.. నిశ్చితార్థం జరిగిపోయిందా.. ?
కేవలం ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది హీరోయిన్ శ్రీలీల. తెలుగు, తమిళం భాషలలో వరుస చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ సరసన ఓ క్రేజీ లవ్ స్టోరీలో నటిస్తుంది. తాజాగా అభిమానులకు షాకిస్తూ కొన్ని ఫోటోస్ రివీల్ చేసింది.

సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ శ్రీలీల. ధమాకా సినిమాతో ఈ అమ్మడు కెరీర్ ఒక్కసారిగా మలుపు తిప్పింది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఇండస్ట్రీలో మెస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఇటీవలే కిస్సిక్ అంటూ స్పెషల్ పాటతో రచ్చ చేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం హిందీలో ఓ క్రేజీ లవ్ స్టోరీలో నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు షాకిచ్చింది. శ్రీలీల తన ఇన్ స్టాలో పలు స్టోరీస్ పంచుకుంది. తన చెంపల మీద పసుపు పూసి కొందరు ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు నాకు బిగ్ డే అంటూనే పూర్తి వివరాలు కమింగ్ సూన్ అంటూ హిట్ ఇచ్చింది.
అయితే శ్రీలీల షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఆమె సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుందని.. త్వరలోనె పెళ్లి గురించి రివీల్ చేయనుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు శ్రీలీల షేర్ చేసిన ఫోటోస్ ఆమె నిశ్చితార్థం కాదని తెలుస్తోంది. జూన్ 14న ఆమె పుట్టినరోజు అని.. కానీ తిథుల ప్రకారం ఆ వేడుకను ఇలా ముందే సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం. ఫోటోస్ షేర్ చేసిన శ్రీలీల ఎలాంటి వివరాలు చెప్పకుండా ఫోటోస్ షేర్ చేయడంతో ఆమె నిశ్చితార్థం వేడుక అంటూ ప్రచారం నడుస్తోంది.

Sreeleela
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది శ్రీలీల. తెలుగుతోపాటు హిందీలోనూ అనేక చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఉన్నట్లుండి ఆకస్మాత్తుగా నిశ్చితార్థం ఎలా చేసుకుందని ఆశ్చర్యపోతున్నారు. తన గురించి వస్తున్న వార్తలలో ఎంత వరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై త్వరలోనే శ్రీలీల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..
