AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత ఏంటి ఇలా మారిపోయింది.. వైరల్‌ అవుతోన్న లేటెస్ట్ లుక్‌

ఇదిలా ఉంటే సినిమాలు లేకపోయినా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం నిత్యం వార్తల్లో ఉంటోంది సమంత. మొన్నటికి మొన్న వరల్డ్ పికిల్‌బాల్ లీగ్‌లో ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సమంత వార్తల్లో నిలిచారు. ఆ సందర్భంగా సమంత ఫొటోలు చూసిన కొందరు అభిమానులు షాక్‌కి గురయ్యారు. సమంత చాలా సన్నబడిందని నెట్టింట కామెంట్స్‌ చేశారు...

Samantha: సమంత ఏంటి ఇలా మారిపోయింది.. వైరల్‌ అవుతోన్న లేటెస్ట్ లుక్‌
Samantha
Narender Vaitla
|

Updated on: Aug 24, 2024 | 10:47 AM

Share

సమంత.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు సమంత. దాదాపు అందరు అగ్ర కథానాయికల సరసన ఆడిపాడిందీ బ్యూటీ. అయితే గత కొన్ని రోజులుగా సమంత పూర్తిగా ఢీలా పడింది. ముఖ్యంగా విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్‌ వ్యాధి బారిన పడడంతో సామ్‌ సినిమాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఖుషీ తప్ప ఇటీవలి కాలంలో సమంత మరో చిత్రంలో నటించలేదు. ఒక్క సిటాడెల్ వెబ్‌ సిరీస్‌తో తప్ప సమంత చేతిలో మరే ప్రాజెక్ట్‌ లేదని చెప్పాలి.

ఇదిలా ఉంటే సినిమాలు లేకపోయినా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం నిత్యం వార్తల్లో ఉంటోంది సమంత. మొన్నటికి మొన్న వరల్డ్ పికిల్‌బాల్ లీగ్‌లో ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సమంత వార్తల్లో నిలిచారు. ఆ సందర్భంగా సమంత ఫొటోలు చూసిన కొందరు అభిమానులు షాక్‌కి గురయ్యారు. సమంత చాలా సన్నబడిందని నెట్టింట కామెంట్స్‌ చేశారు. అయితే తాజాగా కనిపించిన ఫొటోల్లో సమంత పూర్తిగా మారిపోయింది. సామ్‌ కొత్త లుక్‌ చూసిన అభిమానులు ఇదేంటి సమంత ఇలా అయిపోయిందని అంటున్నారు.

Sam

 

ముంబయిలో ఈ ఫ్యాషన్‌లో ఈవెంట్‌లో కనిపించిన సమంతకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత ముఖంలో మునపి ఆకర్షణలేదంటూ, చాలా సన్నగా మారిందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక మరికొందరు ఓ అడుగు ముందుకేసి నాగచైతన్య, శోభితా నిశ్చితార్థం కారణంగానే సమంత బెంగ పెట్టుకుంందని అందుకే ఇలా అయ్యిందంటూ ఎవరికి తోచిన కామెంట్స్‌ వారు చేస్తున్నారు. మరికొందరు మాత్రం సామ్‌ క్షేమాన్ని కోరుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత కొత్త లుక్‌ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అయితే సమంత తీసుకుంటున్న చికిత్స కారణంగా ఇలా మారిందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మయోసైటిస్‌ చికిత్సలో భాగంగానే ఇలా సన్న బడి ఉండొచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే కెరీర్‌ విషయానికొస్తే సామ్‌ నటించిన ‘సిటాడెల్: హనీ బానీ’ వెబ్‌ సిరీస్‌ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే దీని తర్వాత సామ్‌ మరో కొత్త ప్రాజెక్టుకు అంగీకరించలేదు. సమంత కేవలం బాలీవుడ్‌ మూవీలను మాత్రమే అంగీకరిస్తోందని.. ఇకపై తెలుగు సినిమాల్లో నటించేందుకు విముకత వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై సామ్‌ ఇప్పటి వరకు స్పందిచలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..