Krithi Shetty: నిజంగానే చిరు సినిమాను కృతి రిజక్ట్ చేసిందా.? అసలు విషయం ఏంటంటే..
చిరు ప్రాజెక్ట్‌ను కృతిశెట్టి రిజక్ట్ చేసిందని పెద్ద ఎత్తున చర్చ నడించింది. అయితే తాజాగా ఈ వార్తలపై కృతి స్వయంగా స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. తనను ఎవరూ సంప్రదిచలేదని, కావాలనే ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది....

సినిమా తారలకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతునే ఉంటుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. వ్యక్తిగత జీవితాలతో పాటు ప్రొఫెషనల్ కెరీర్‌కు సంబంధించిన వార్తలు సైతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అందాల తార కృతిశెట్టికి సంబంధించిన వార్త ఇలాగే తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే వచ్చిందని సదరు వార్తల సారంశం.
చిరు ప్రాజెక్ట్‌ను కృతిశెట్టి రిజక్ట్ చేసిందని పెద్ద ఎత్తున చర్చ నడించింది. అయితే తాజాగా ఈ వార్తలపై కృతి స్వయంగా స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. తనను ఎవరూ సంప్రదిచలేదని, కావాలనే ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి ఇంతటితోనైనా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే తెలుగు, తమిళ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఈ చిన్నది ప్రస్తుతం తన ఫోకస్‌ను మలయాళ ఇండస్ట్రీవైపు తిప్పింది. టొవినో థామస్‌తో కలిసి ‘అజయంతే రందం మోషణం’ అనే చిత్రంలో నటిస్తోంది. సెప్టెంబర్ 12వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో కృతి ఈ విషయాలను వెల్లడించింది. అలాగే ఈ సందర్భంగా కృతి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
కృతి లేటెస్ట్ ఇన్‌స్టా పోస్ట్..
View this post on Instagram
తెలుగు సినిమా, మలయాళ చిత్ర పరిశ్రమలకు మధ్య తేడా గురించి మాట్లాడుతూ.. మలయాళ చిత్రపరిశ్రమలో ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుందని, టాలీవుడ్‌తో పోలిస్తే అక్కడ పనిగంటలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చింది. షూటింగ్ కారణంగా నాలుగో రోజు నిద్రలేకపోవడం వల్ల కళ్లు కూడా తెరవలేకపోయానని, అలసటగా అనిపించింది. కొన్ని నెలల పాటు అలా నిద్ర లేకుండానే పనిచేశానని తెలిపింది. ఇక మలయాళ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలోని విజువల్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయని, ఇందులో పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తానని తెలిపిందీ బ్యూటీ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




