సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన ప్రేమ కావ్యం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గుణ శేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. భారీ హైప్ ఉన్నప్పటికీ ఈ సినిమా కేవలం కొందరినీ మాత్రమే ఆకట్టుకుందనే వాదనలు వినిపించాయి. అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ దీనిపై స్పందించలేదు.
ఇదిలా ఉంటే తాజాగా నటి సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భగవద్గీతలోని శ్లోకాన్ని పోస్ట్ చేసింది సామ్. దీంతో సామ్ చేసిన ఈ పోస్ట్ శాకుంతలం రిజల్ట్ గురించేనా అనే చర్చ మొదలైంది. ఇంతకీ సమంత చేసిన పోస్ట్ ఏంటంటే.. ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి’ అనే శ్లోకాన్ని పోస్ట్ చేసింది. ఈ శ్లోకం అర్థం.. ‘నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు ; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు ; అలాగని కర్మలు చేయడం మానకు’.
దీంతో సమంత ముమ్మాటికీ ఈ పోస్టును శాకుంతలం మూవీ ఫలితాన్ని ఉద్దేశించే చేసిందని నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. ఒక మరికొందరు స్పందిస్తూ సోషల్ మీడియాలో జరుగుతోన్న నెగిటివ్ ప్రచారానికి చెక్ పెట్టేందుకే సమంత ఇలా పోస్ట్ చేసిందని అంటున్నారు. ఇదిలా ఉంటే సామ్ ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌తో పాటు తెలుగులో ఖుషీ మూవీలో నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..