Regina cassandra: నా జీవితంలో ప్రేమ అనేం అంశం ముగిసిన అధ్యాయనం.. రెజీనా షాకింగ్‌ కామెంట్స్‌..

Regina cassandra: రెజీనా.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివ మనసులో శృతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ బ్యూటీ అనతికాలంలోనే...

Regina cassandra: నా జీవితంలో ప్రేమ అనేం అంశం ముగిసిన అధ్యాయనం.. రెజీనా షాకింగ్‌ కామెంట్స్‌..
Regina Cassandra

Updated on: Sep 10, 2022 | 6:30 AM

Regina cassandra: రెజీనా.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివ మనసులో శృతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ బ్యూటీ అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన రెజీనా అందంతోపాటు నటనతోనూ మెప్పించింది. ఇక ప్రస్తుతం ఈ చిన్నది శాకిని ఢాకిని అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో రెజీనాతో పాటు నివేధా థామస్‌ కూడా నటిస్తోంది. సెప్టెంబర్‌ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన రెజీనా తన వ్యక్తితగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఇప్పటి వరకు ఎప్పుడూ ప్రేమ, పెళ్లి విషయాలను పంచుకొని రెజీనా తొలిసారి వాటిపై ఓపెన్‌ అయ్యింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ప్రేమ అనే అంశం 2020లోనే ముగిసిపోయింది. దాని నుంచి బయటపడేందుకు ఎంతో కష్టపడ్డాను, ప్రస్తుతం ఎవరినీ ప్రేమించడేలదు, అలాంటి ఆలోచన కూడా మదిలోకి రానివ్వట్లేదు’ అని గతాన్ని నెమరువేసుకుంది. ఇక ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపిన రెజీనా.. అసలు తన జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదంటూ షాకింగ్ కామెంట్ చేసింది.

అంతేకాకుండా ఎదుటివారిపై ఆధారపడకుండా సొంతంగా జీవించడం ఎలాగో చిన్నతనంలోనే తన తల్లి నేర్పిందని, జీవితంలో తోడు కావాలా? వద్దా? అనే విషయం గురించి ప్రస్తుతం ఆలోచించనని ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసింది. ఏది ఏమైనా తొలిసారి రెజీనా ఇలాంటి కామెంట్స్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..