Rakul preet singh: రకుల్ తెలుగులో ఎందుకు నటించడం లేదు.? అసలు రీజన్ చెప్పేసిన అందాల తార..
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. అనంతరం ఒక తమిళ్, హిందీ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం వరుసగా తెలుగు సినిమాల్లో నటించింది. ఏకంగా 12 తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. టాలీవుడ్లో దాదాపు అందరూ..
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. అనంతరం ఒక తమిళ్, హిందీ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం వరుసగా తెలుగు సినిమాల్లో నటించింది. ఏకంగా 12 తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. టాలీవుడ్లో దాదాపు అందరూ యంగ్ టాప్ హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ అనతికాలంలోనే అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజింగ్ చేసిన ఈ చిన్నది బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ రాణించింది.
ఇదిలా ఉంటే 2021లో వచ్చిన కొండ పాలేం చిత్రం తర్వాత రకుల్ మళ్లీ తెలుగు సినిమాలో నటించలేదు. ఈ సినిమా తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కు మకాం మార్చిన ఈ చిన్నది అక్కడే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బీటౌన్‌లో బిజీగా మారింది. ఇండియన్ 2 చిత్రంలో నటిస్తోన్నా అది స్ట్రెయిట్ తెలుగు మూవీ కాదు. దీంతో రకుల్ తెలుగు సినిమాల్లో ఎందుకు నటించడం లేదని వార్తలు షికార్లు చేశాయి. రకుల్ తెలుగు సినిమాలకు పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై రకుల్ ఎప్పుడూ స్పందించకపోవడంతో వార్తలకు ఊతమిచ్చినట్లైంది.
View this post on Instagram
అయితే తాజాగా ఈ విషయమై రకుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ ముద్దుగుమ్మ నటించిన బాలీవుడ్ చిత్రం డాక్టర్ జీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రకుల్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. తెలుగు సినిమాల్లో ఎందుకు నటించడం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. తెలుగులో సినిమా చేయలేకపోతున్నాన్న విషయం నాకు తెలుసు. కానీ త్వరలోనే టాలీవుడ్లో మళ్లీ నటించనున్నాను. తెలుగు ఫ్యాన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ముమ్మాటికీ తెలుగు ప్రేక్షకులే కారణం. వచ్చే ఏడాది తెలుగులో కచ్చితంగా నటిస్తాను’ అని మానసులో మాట బయటపెట్టిందీ బ్యూటీ. దీంతో పుకార్లకు చెక్ పడినట్లైంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..