Rakul Preet Singh: సినిమాకు భాషతో సంబంధం ఉండదు, అదొక ఎమోషనల్‌ జర్నీ.. రకుల్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

|

May 28, 2022 | 6:20 AM

Rakul Preet Singh: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో భాష అనే అంతరం చెరిగిపోతోంది. ఏ భాషలో విడుదలైన చిత్రమైనా దేశంలోని అన్ని భాషల్లో విడుదలువుతున్నాయి. దీనికే మేకర్స్‌ పాన్‌ ఇండియా (Pan India) అని పేరు పెడుతున్నారు..

Rakul Preet Singh: సినిమాకు భాషతో సంబంధం ఉండదు, అదొక ఎమోషనల్‌ జర్నీ.. రకుల్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Follow us on

Rakul Preet Singh: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో భాష అనే అంతరం చెరిగిపోతోంది. ఏ భాషలో విడుదలైన చిత్రమైనా దేశంలోని అన్ని భాషల్లో విడుదలువుతున్నాయి. దీనికే మేకర్స్‌ పాన్‌ ఇండియా (Pan India) అని పేరు పెడుతున్నారు. దర్శకులు కూడా అన్ని భాషల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా కథలను సిద్ధం చేసుకుంటున్నారు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్‌ మొన్నటి మొన్న వచ్చిన కేజీఎఫ్‌ వరకు కొనసాగింది. సౌత్‌ సినిమాలు నార్త్‌లో ఎన్నడూ లేని విధంగా దుమ్మురేపుతున్నాయి. దీంతో అసలు సినిమాకు భాషతో సంబంధం లేదనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా అందాల తార రకుల్‌ ప్రీత్‌సింగ్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాన్‌ ఇండియా చిత్రాలపై తనదైన శైలిలో స్పందించింది. ఈ విషయమై రకుల్‌ మాట్లాడుతూ.. ‘మంచి సినిమాలను ప్రజలు ఎప్పటికీ ఇష్టపడతారు. ఇప్పటి వరకు హిందీ డబ్‌ అయిన నా సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ ప్రస్తుతం సినిమాలు నేరుగా థియేటర్లలో విడుదలువున్నాయి. ఇప్పుడు నేరుగా థియేటర్‌కు వచ్చి ఇతర భాషలకు చెందిన చిత్రాలను చూస్తున్నారు. సినిమాకు భాషతో సంబంధం ఉండదు. అది ఒక ఎమోషన్‌ అని నేను నమ్ముతాను’ అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇక దక్షిణాది చిత్రాలకు బాలీవుడ్‌ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంపై స్పందిస్తూ.. నార్త్‌ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయమని, అందరూ ఒకరికొకరు సహయం చేసుకుంటూ సినిమాలు తీస్తే ఎంత బాగుటుందో ఓసారి ఊహించుకోండి అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది రకుల్‌.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..