Pranitha Subhash: పండంటి బిడ్డను ప్రసవించిన బాపు బొమ్మ.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోస్‌..

Pranitha Subhash: ప్రముఖ హీరోయిన్ ప్రణీత(pranitha subhash) తల్లిగా ప్రమోషన్‌ పొందింది. తాజాగా ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా ఆమె అభిమానులతో పంచుకుంది.

Pranitha Subhash: పండంటి బిడ్డను ప్రసవించిన బాపు బొమ్మ.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోస్‌..
Pranitha Subhash

Updated on: Jun 10, 2022 | 9:30 PM

Pranitha Subhash: ప్రముఖ హీరోయిన్ ప్రణీత(pranitha subhash) తల్లిగా ప్రమోషన్‌ పొందింది. తాజాగా ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా ఆమె అభిమానులతో పంచుకుంది. ‘గత కొన్ని రోజులుగా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. అయితే మాకు పండంటి ఆడబిడ్డ పుట్టేసింది’ అంటూ బిడ్డతో కలిసున్న ఫొటోను షేర్‌ చేసింది ప్రణీత. ఈ సందర్భంగా తన ప్రసవంలో దగ్గరుండి అన్ని చూసుకున్న తన తల్లికి థ్యాంక్స్ చెప్పింది. కాగా  పొత్తిళ్లలో తన బిడ్డను చూసుకుంటూ మాతృత్వపు మాధుర్యంతో మురిసిపోతోన్న ప్రణీత ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ప్రణీత. ఆ తర్వాత సిద్ధార్థ్‌ సరసన హీరోయిన్‌గా బావ మూవీలో నటించి మెప్పించింది. ఇక పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ సరసన అత్తారింటింకి దారేది లో నటించి మొదటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇందులో పవన్‌తో కలిసి ఆమె చేసిన బాపూ బొమ్మ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును గతేడాది 30న వివాహం చేసుకుందీ అందాల తార. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన భర్త పుట్టిన రోజును పురస్కరించుకుని తాను తల్లిని కాబోతున్న శుభవార్తను పంచుకుంది. ఆ తర్వాత సీమంతం వేడుకలు, బేబీ షవర్ ఫొటోషూట్లతో నిత్యం వార్తల్లో నిలిచింది. తాజాగా తల్లిగా ప్రమోషన్‌ పొంది మాతృత్వపు మాధుర్యంలో తేలియాడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Major Collections: బాక్సాఫీస్‌ వద్ద మేజర్‌ హవా.. మొదటి వారంలో ఎంత రాబట్టిందంటే..

Ranji Trophy 2022: రంజీ ట్రోఫీలో అదరగొట్టిన క్రీడా మంత్రి.. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో సరికొత్త రికార్డు..

Pawan Kalyan: పవర్‌స్టార్‌ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ .. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ డైరెక్టర్‌.. ఇలాంటివి పోస్ట్‌ చేసేముందు అంటూ..