Pooja Hegde: ‘ఓటమి, గెలుపులను సమానంగా చూడాలి, అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరకుంటాం. అనుకున్నది సాధిస్తాం’. పెద్దలు ఇలాంటివి ఎక్కువగా చెబుతుంటారు. ఓటముల నుంచే నేర్చుకొని గెలుపునకు దారి వేసుకోవాలంటారు. ఇప్పుడు ఇదే విషయాన్ని చెబుతోంది అందాల తార పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్‌లో (Tollywood) నెం1 రేసులో దూసుకుపోతున్న ఈ చిన్నది కెరీర్‌ను మాత్రం అపజయంతోనే మొదలు పెట్టింది. అయితే ఆ పరాజయాలే తన విజయాలకు తొలి మెట్టుగా మారాయని చెబుతోందీ బ్యూటీ.
2012లో తమిళ చిత్రం మూగమూడి అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది పూజా. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేక పోయింది. కానీ తెలుగులో నటించిన ఒక లైలా మాత్రం పూజాకు తొలి విజయాన్ని తెచ్చి పెట్టింది. ఆ తర్వాత మళ్లీ ముకుందా, మోహెంజో దారో, దువ్వాడ జగన్నాథంతో మళ్లీ పరాజయాలు ఎదుర్కోంది. అయితే ఆ తర్వాత సినిమాలన్నీ వరుసగా విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో అగ్ర హీరోల సరసన నటిస్తూ జోరు పెంచేసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉందీ బ్యూటీ. బీస్ట్, ఆచార్య వంటి భారీ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోందీ బ్యూటీ.
ఈ నేపథ్యంలో తాజాగా కోలీవుడ్ మీడియాతో మాట్లాడిన పూజా తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా పూజా మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ నా సినిమాలు ప్రేక్షకులకు వినోదం పంచితే చాలనుకుంటా. గెలుగు, ఓటములను అసలు పట్టించుకోను. కెరీర్ తొలినాళ్లలో వరుస పరాజయాలను చవిచూశాను. వాటి వల్లే విజయాన్ని ఎక్కువగా సీరియస్‌గా తీసుకోకూడదన్న విషయం తెలిసొచ్చింది. ఓటమిల కారణంగానే జయాపజయాలను సమంగా తీసుకొనే నేర్పు వచ్చింది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
RRR థియేటర్ ముందు తారక్ ఫ్యాన్ ఆత్మహత్యాయత్నం !!
Viral Video: దేనికో మూడినట్టే..! రాబందుల అత్యవసర సమావేశం.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..