Pooja Hegde: అందం, అభినయం కలగలిపిన నటీమణుల్లో పూజా హెగ్డే ఒకరు. ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల తార అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది. వరుస విజయాలను అందుకుంటూ టాప్ యంగ్ హీరోల సరసన నటించే లక్కీ చాన్స్ కొట్టేసిందీ చిన్నది. ఈ క్రమంలోనే పూజా తాజాగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక కెరీర్‌లో సరైన విజయం అందక సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ లక్కీ గర్ల్ విజయాన్ని అందించింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పూజా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అవుతోంది. అయితే తాను మాత్రం ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. కెరీర్ పరంగా అనుకోని గ్యాప్‌లు వచ్చాయని, భారీ విజయాలు అందుకున్నా సరే ఇప్పుడే నా కెరీర్ మొదలైందనిపిస్తోందని చెప్పుకొచ్చింది. ఇక బయోపిక్‌లో నటించాలని ఉందని చెప్పిన పూజా.. జైపూర్ మహారాణి గాయత్రి దేవి జీవిత కథలో నటించాలని ఉందని మనసులో మాట చెప్పేసింది.
ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. తనకు ఇప్పటి వరకు ఒక్క లవ్ లెటర్ కూడా రాలేదని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ.. కాలేజీ రోజుల్లో నేను చాలా సిగ్గుపడేదాన్ని, ఇప్పుడేమో సినిమాలతో బిజీగా ఉన్నాను. మరి భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక పూజా హెగ్డే కెరీర్ విషయానికొస్తే.. ఈ అమ్మడు ప్రస్తుతం రాధేశ్యామ్, బీస్ట్‌లతో పాటు బాలీవుడ్‌లో ఓ చిత్రంలో నటిస్తోంది.
Also Read: Google Analytics: వెబ్‌సైట్లకు జీరో యూజర్లు.. గందరగోళంలో సైట్ ఓనర్స్. అసలేం జరిగిందంటే..
Hyderabad: ‘అయ్యాయో వద్దమ్మా’ శరత్ ని చితక బాదారా?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..
Hyderabad: ప్రియుడితో ఏకాంతంగా బాలిక.. అది గమనించిన తల్లి వార్నింగ్.. ఆ వెంటనే ఊహించని ఘటన..!