Namitha: అలాంటి సినిమాలు బోర్ కొట్టేశాయి: నమిత హాట్ కామెంట్స్

కెరీర్ ప్రారంభంలో ఇటు తెలుగు, అటు తమిళ్‌లో చేతి నిండా సినిమాలతో దూసుకుపోయిన నమిత.. ఆ తరువాత కాస్ల స్లో అయ్యారు. వరుస పరాజయాలు రావడం, దానికి తోడు బరువు కూడా పెరగడంతో నమితకు అవకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి.

Namitha: అలాంటి సినిమాలు బోర్ కొట్టేశాయి: నమిత హాట్ కామెంట్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 26, 2020 | 4:52 PM

కెరీర్ ప్రారంభంలో ఇటు తెలుగు, అటు తమిళ్‌లో చేతి నిండా సినిమాలతో దూసుకుపోయిన నమిత.. ఆ తరువాత కాస్ల స్లో అయ్యారు. వరుస పరాజయాలు రావడం, దానికి తోడు బరువు కూడా పెరగడంతో నమితకు అవకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి. అయినా ఏదో అడపాదడపా పాత్రలో నటిస్తూ తన ఉనికి చాటుకుంటూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం సహనటుడు వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్న నమిత.. ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఆడియో కార్యక్రమంలో నమిత హాట్ కామెంట్లు చేసింది.

తనకు రొమాంటిక్ సినిమాలంటే చాలా ఇష్టమని నమిత చెప్పుకొచ్చింది. ఒకప్పుడు ఆ సినిమాలే ఎక్కువగా చూసేదాన్నని.. కానీ చూసి చూసి బోర్ కొట్టేసిందని తెలిపింది. ఇప్పుడు ఆ తరహా చిత్రాలు నచ్చడం లేదని నమిత పేర్కొంది. ప్రస్తుతం కామెడీ సినిమాలే చూడాలనిపిస్తోందని.. అందుకే ఎక్కువగా హాస్య చిత్రాలే చూస్తున్నానని ఆమె చెప్పింది. ఇక ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. కాగా బాలక‌ృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కిస్తోన్న సినిమాలో ఓ పాత్ర కోసం నమిత ఫిక్స్ అయినట్లు ఇటీవల ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా బాలయ్య నటించిన సింహా సినిమాలో నమిత నటించిన విషయం తెలిసిందే.