Mrunal Thakur: రణ్‌బీర్‌పై ప్రశంసలు కురిపించిన మృణాల్.. ‘అది కూడా చూడాలంటూ’..
అబుదాబి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ చిత్రంతో పాటు పలు విభాగాల్లో యానిమల్ అవార్డులను సొంతం చేసుకుంది. అయితే యానిమల్ మూవీ ఎంత విజయాన్ని అందుకుందో అదే స్థాయిలో నెగిటివ్‌ను కూడా మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో మితిమీరిన వయలెన్స్ ఉందని. ఈ స్థాయిలో అరాచకం అవసరమా అంటూ...
సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ మూవీ ఏ రేంజ్‌లో విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ రికార్డు కలెక్షన్లను రాబట్టిందీ మూవీ. ఇక తాజాగా ప్రకటించిన ఐఫా అవార్డు సైతం దక్కడం విశేషం.
అబుదాబి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ చిత్రంతో పాటు పలు విభాగాల్లో యానిమల్ అవార్డులను సొంతం చేసుకుంది. అయితే యానిమల్ మూవీ ఎంత విజయాన్ని అందుకుందో అదే స్థాయిలో నెగిటివ్‌ను కూడా మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో మితిమీరిన వయలెన్స్ ఉందని. ఈ స్థాయిలో అరాచకం అవసరమా అంటూ కొందరు నెటిజన్లు సినిమా విడుదల సమయంలో స్పందించారు.
ఇక మహిళలను ఈ సినిమాలో చూపించిన విధానం కూడా బాగాలేదంటూ క్రిటిక్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అయితే యానిమల్ మూవీకి మద్ధతుగా నిలిచిన వారు కూడా ఉండడం విశేషం. ఈ క్రమంలోనే తాజాగా అందాల తార మృణాల్ ఠాకూర్.. హీరో రణ్‌బీర్ కపూర్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా జరిగిన ఐఫా వేడుకల్లో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ.. అందరూ యానిమల్ సినిమాలో రణ్‌బీర్ పాత్ర గురించే మాట్లాడుతున్నారు. ఆ పాత్ర ఎంతో క్రూరంగా ఉన్నదని విమర్శిస్తున్నారని చెప్పుకొచ్చింది.
మృణాల్ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..
View this post on Instagram
అయితే ఇదే రణ్‌బీర్ 2012లో నటించిన బర్ఫీలో చెవిటి-మూగ వ్యక్తిగా నటించిన విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు. అప్పుడు అమాయకుడిగా.. ఇప్పుడు యానిమల్‌గా రెండు విభిన్న పాత్రలను అద్భుతంగా పండించాడు రణ్‌బీర్ అంటూ రణ్‌బీర్‌పై ప్రశంసలు కురిపించిందీ మూవీ. ఇక మృణాల్ కెరీర్ విషయానికొస్తే సీతారామమ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ అందాల తార అనంతరం పలు వరుస అవకాశాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఏకాగ్రత మొత్తం బాలీవుడ్‌పై పెట్టింది. బీ టౌన్‌లో ప్రస్తుతం మృణాలో ఏకంగా నాలుగు చిత్రాల్లో నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..