Mrunal Thakur: ప్రభాస్‌కు జోడిగా మృణాల్.? క్లారిటీ ఇచ్చిన బ్యూటీ..
వీటిలో ఒకటి హను రాఘపపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా. సీతా రామమ్ వంటి భారీ విజయాన్ని అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రానుందన్న వార్తలు ఒక్కసారిగా ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. అందులోనూ ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో నటించనున్నాడని వచ్చిన వార్తలు...
ప్రభాస్.. యావత్ ఇండియన్ సినిమా లవర్స్‌కి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రికార్డులను తిరగరాస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. కల్కి, సలార్ వంటి బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్‌తో అగ్ర స్థానంలో నిలిచారు. దీంతో ప్రభాస్ తర్వాతి సినిమాలపై ఊహకందని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే.
వీటిలో ఒకటి హను రాఘపపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా. సీతా రామమ్ వంటి భారీ విజయాన్ని అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రానుందన్న వార్తలు ఒక్కసారిగా ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. అందులోనూ ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో నటించనున్నాడని వచ్చిన వార్తలు మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ రూమర్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా అందాల తార మృణాల్ ఠాకూర్ నటించనుందని సదుర వార్త సారంశం. సీతారామమ్‌లో తన అద్భుత నటనతో మెస్మరైజ్ చేసిన మృణాల్‌ను రాఘవపూడి తన తదుపరి చిత్రంలోనూ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై మృణాల్ క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్‌తో మృణాల్ ఉన్న ఫొటో ఒకటి ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో హను రాఘవపూడి చిత్రం ఫస్ట్‌లుక్ అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్‌పై స్పందించిన మృణాల్.. ‘మీ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెడుతున్నందుకు క్షమించండి. నేను ఈ ప్రాజెక్ట్‌లో లేను’ అని మృణాల్ క్లారిటీ ఇచ్చింది.
దీంతో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు చెక్ పడినట్లైంది. ఇంతకీ ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా ఎవరు నటించనున్నారన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోనున్నారని మరో వైపు చర్చ నడుస్తోంది. ఇందులో ఎంత వరకు క్లారిటీ ఉందో తెలియాలంటే అధికారిక ప్రటకన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..