Keerthy Suresh: ఆయనతో డ్యాన్స్‌ చేయలేమోనని భయపడ్డా.. కీర్తి సురేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చిరంజీవికి చెల్లిగా నటించడంపై స్పందించిన కీర్తి.. ఈ సినిమాలో అవకాశం రాగానే చాలా సంతోషించానని కానీ తనకు చిరుతో డ్యాన్స్‌ చేసే అవకాశం ఉంటుందో లేదోనని కాస్త భయంగానూ అనిపించినట్లు చెప్పుకొచ్చింది. అయితే అదృష్టవశాత్తూ భోళా శంకర్‌లో చిరుతో రెండు పాటల్లో డ్యాన్స్‌ చేశానని చెప్పుకొచ్చింది. ఇక భోళా శంకర్‌ మూవీ స్టోరీలైన్‌ గురించి చెబుతూ.. అన్నాచెల్లి అనుబంధాల చుట్టూ అల్లుకున్న కథతో రూపొందిన చిత్రమిది అని తెలిపింది. వినోదం, యాక్షన్‌.. ఇలా అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని...

Keerthy Suresh: ఆయనతో డ్యాన్స్‌ చేయలేమోనని భయపడ్డా.. కీర్తి సురేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
Keerthy Suresh

Updated on: Aug 06, 2023 | 8:18 AM

అందం, అభినయం కలగలిసిన అతికొద్ది మంది నటీమణుల్లో కీర్తి సురేష్‌ ఒకరు. నట వారసత్వం అండగా ఉన్నా తన నటనతో నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ సంపాదించుకుంది. మహా నటిలో అద్భుత నటనతో ఏకంగా నేషనల్ అవార్డ్‌ను సొంతం చేసుకుందీ బ్యూటీ. ఇక సినిమాల ఎంపికలోనూ తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతోంది. గ్లామర్‌ పాత్రలకు వీలైనంత వరకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తు మెప్పిస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం భోళా శంకర్‌. ఈ సినిమాలో చిరంజీకి చెల్లెలిగా నటిస్తోంది కీర్తి. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం మీడియాతో మాట్లాడిన కీర్తి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

చిరంజీవికి చెల్లిగా నటించడంపై స్పందించిన కీర్తి.. ఈ సినిమాలో అవకాశం రాగానే చాలా సంతోషించానని కానీ తనకు చిరుతో డ్యాన్స్‌ చేసే అవకాశం ఉంటుందో లేదోనని కాస్త భయంగానూ అనిపించినట్లు చెప్పుకొచ్చింది. అయితే అదృష్టవశాత్తూ భోళా శంకర్‌లో చిరుతో రెండు పాటల్లో డ్యాన్స్‌ చేశానని చెప్పుకొచ్చింది. ఇక భోళా శంకర్‌ మూవీ స్టోరీలైన్‌ గురించి చెబుతూ.. అన్నాచెల్లి అనుబంధాల చుట్టూ అల్లుకున్న కథతో రూపొందిన చిత్రమిది అని తెలిపింది. వినోదం, యాక్షన్‌.. ఇలా అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని, తమన్నా చిరు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని చెప్పుకొచ్చింది కీర్తి.

ఇక చిరంజీవితో తన తల్లికి ఉన్న అనుబంధాన్ని సైతం పంచుకున్నారు. కీర్తి తల్లి, పున్నమినాగు సినిమాలో నటించినట్లు తెలిపిన కీర్తి.. అప్పటికి తన తల్లి వయసు 16 ఏళ్లేనని, తనని ఆయన ఓ చిన్నపిల్లలా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇక భోళా శంకర్‌ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు తనకు చిరంజీవి ఇంటి నుంచే భోజనం తెప్పించారని, ఆయన ఇంటి నుంచి వచ్చే ఉలవచారు తనకు ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చింది. తనకు స్నేహితులు ఎక్కువని చెప్పిన కీర్తి.. తన ఎదుగుదలలో వారి ప్రోత్సాహం ఎందో ఉందని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

టైమ్‌ దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్‌తో గడిపేందుకు ఇష్టపడుతానన్న కీర్తి, తనకు బ్రదర్స్‌ లాంటి ఫ్రెండ్స్‌ కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది. భోళా శంకర్ వల్ల చిరుతో మంచి స్నేహ బంధం ఏర్పడిందన్న కీర్తి.. చిరు తన అమ్మకు మంచి మిత్రుడని, ఇప్పుడు ఆయనకు తాను కొత్త ఫ్రెండ్ అని తెలిపింది. ఫ్రెండ్‌షిప్‌ డేను ప్రత్యేకంగా జరుపుకోవడమనేది తనకు తెలియదని, ఏడాదంతా వేడుక చేసుకుంటూనే ఉంటామని, ప్రతీ రోజూ ఫ్రెండ్‌షిప్‌డేనే అని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..