AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్.. 41 ఏళ్ల వయసులో సింగపూర్ వ్యాపారవేత్తతో వివాహం.. వీడియో వైరల్..

సినీతారలకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ పర్సనల్ విషయాలు ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి క్షణాల్లో నెట్టింట వైరలవుతుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ రెండో పెళ్లి చేసుకుంది. తన పెళ్లి వీడియోను తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసింది.

Tollywood : రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్.. 41 ఏళ్ల వయసులో సింగపూర్ వ్యాపారవేత్తతో వివాహం.. వీడియో వైరల్..
Jannifer Winget
Rajitha Chanti
|

Updated on: Jul 19, 2026 | 7:17 AM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరలవుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఓ హీరోయిన్ రెండో పెళ్లి గురించి ఫిల్మ్ వర్గాల్లో పెద్ద ప్రచారమే నడిచింది. మొదటి భర్తతో విడాకుల తర్వాత దాదాపు 12 సంవత్సరాలు ఒంటరిగా ఉన్న ఆమె.. ఇప్పుడు 41 ఏళ్ల వయసులో రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా తన పెళ్లి వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆమె మరెవరో కాదు.. జెన్నిఫర్ వింగెట్. హిందీ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. అంతేకాదు.. బాలీవుడ్ స్మాల్ స్క్రీన్ పై అత్యధిక ఫాలోయింగ్ ఉన్న గ్లామర్ క్వీన్ కూడా. కసౌటీ జిందగీ కే, సరస్వతి చంద్ర, బేహద్, బేపన్నా, కోట్ ఎం వంటి సీరియల్స్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. కెరీర్ పరంగా సక్సెస్ అయిన ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం తీవ్ర ఒడిదుడుకులతో నిండి ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

గతంలో దిల్ మిల్ గయే సీరియల్లో నటించింది జెన్నిఫర్. ఇందులో నటించిన తన సహనటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మరింది. 2012లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ మనస్పర్థలతో పెళ్లైనా రెండేళ్లకే విడిపోయారు. 2014లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కెరీర్ పై ఫోకస్ చేసిన జెన్నిఫర్ దాదాపు 12 సంవత్సరాలు ఒంటరిగానే గడిపింది.

ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

ఇదిలా ఉంటే.. ఇటీవల జెన్నిఫర్ సెకండ్ మ్యారేజ్ గురించి అనేక రూమర్స్ వినిపించాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఈ అమ్మడు.. తాజాగా తన పెళ్లి వీడియోను షేర్ చేసింది. సింగపూర్ కు చెందిన వ్యాపారవేత్త విలియమ్ ఇస్మాయిల్ ను తన భర్తగా పరిచయం చేస్తూ వివాహం గురించి అధికారికంగా ప్రకటించింది. యూకేలోని ఓ చర్చిలో సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. దీంతో జెన్నిఫర్ దంపతులకు సెలబ్రేటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..

జెన్నిఫర్ వింగెట్ పెళ్లి వీడియో..

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..

Follow Us