Eesha Rebba: మలయాళ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన తెలుగమ్మాయి.. ఈషా రెబ్బా ఆసక్తికర ట్వీట్‌..

Eesha Rebba: 2012లో వచ్చిన 'లైఫ్‌ ఇజ్‌ బ్యూటీఫుల్‌' చిత్రంతో తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార ఈషా రెబ్బా. ఈ సినిమాలో ఈషాకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినా రెండో చిత్రంతోనే..

Eesha Rebba: మలయాళ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన తెలుగమ్మాయి.. ఈషా రెబ్బా ఆసక్తికర ట్వీట్‌..
Esha Rebba

Updated on: Nov 21, 2021 | 8:33 AM

Eesha Rebba: 2012లో వచ్చిన ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటీఫుల్‌’ చిత్రంతో తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార ఈషా రెబ్బా. ఈ సినిమాలో ఈషాకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినా రెండో చిత్రంతోనే హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది. ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్‌గా మారిన ఈ చిన్నది తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఈషా రూపంలో తెలుగు ఇండస్ట్రీకి మరో తెలుగు హీరోయిన్‌ లభించింది. ఇక ‘అమీతుమి’, ‘అ!’ వంటి చిత్రాల్లో నటించిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ చిన్నది.

ఇక అరవింద సమేతతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘పిట్ట కథలు’, ఆహా వేదికగా విడుదలైన ‘త్రీ రోజెస్‌’తో వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించింది ఈషా. ఈ రెండు వెబ్‌ సిరీస్‌ల్లోనూ వైవిధ్యమైన పాత్రలో నటించిన ఈషా డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై కూడా తనదైన ముద్ర వేసింది. ఇక తెలుగులో అవకాశాలు దక్కించుకుంటున్న సమయంలోనే ఈషాకు మలయాళ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలోనే ఈషా ‘ఒట్టు’ అనే మలయాళ చిత్రంలో నటించింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అరవింద్‌ స్వామి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ఈషా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించింది.

ఇక తాజాగా చిత్ర షూటింగ్ ముగిసిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఈషా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఫోటోను పోస్ట్‌ చేస్తూ.. ‘నా తొలి మలయాళ సినిమా చిత్రీకరణ నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది’ అని ట్వీట్ చేసింది. మరి మలయాళంలో ఈషాకు ఎలాంటి ఫేమ్‌ వస్తుందో చూడాలి.

Also Read: IIT Recruitment: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులంటే..

Acid Attack: యువకుడిపై యాసిడ్‌ దాడి చేసిన ఇద్దరు పిల్లల తల్లి..! ఎందుకో తెలుసా..?

Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్‌ రేట్‌ ఎంతంటే..?