Adah Sharma: డస్ట్‌బిన్‌ తో డ్యాన్స్‌ చేసిన హార్ట్‌ ఎటాక్‌ హీరోయిన్‌ .. నెటిజన్లు ఏమంటున్నారంటే..

‘హార్ట్‌ ఎటాక్‌’ (Heart Attack) సినిమాతో అరంగేట్రం చేసి తన అందంతో నిజంగానే యువతకు గుండెపోటు తెప్పించింది అదా శర్మ (Adah Sharma).

Adah Sharma: డస్ట్‌బిన్‌ తో డ్యాన్స్‌ చేసిన హార్ట్‌ ఎటాక్‌ హీరోయిన్‌ .. నెటిజన్లు ఏమంటున్నారంటే..
Adah Sharma

Updated on: Feb 17, 2022 | 5:50 PM

‘హార్ట్‌ ఎటాక్‌’ (Heart Attack) సినిమాతో అరంగేట్రం చేసి తన అందంతో నిజంగానే యువతకు గుండెపోటు తెప్పించింది అదా శర్మ (Adah Sharma). రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుందీ సొగసరి. ఆతర్వాత సన్నాఫ్‌ సత్యమూర్తి, క్షణం, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, కల్కి తదితర చిత్రాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి విజయాలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల తార సోషల్‌ మీడియాలో బిజీబిజీగా ఉంటోంది. నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో పంచుకుంటోంది. అదేవిధంగా వింత వింత విన్యాసాలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. అలా తాజాగా అదా శర్మ షేర్‌ చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఈ వీడియోలో ట్రెండీ కలర్‌ బ్లాక్‌ కలర్‌ దుస్తులు, హైహీల్స్‌లో ఎంతో అందంగా కనిపించిన అదా.. రెండు పాలిథిన్‌ సంచుల్లో చెత్తను తీసుకొచ్చి డస్ట్‌బిన్‌ లో పడేస్తుంది. అనంతరం వాటిని పట్టుకుని వివిధ పోజుల్లో డ్యాన్స్‌ చేస్తుంది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేసింది. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. చెత్తను డస్ట్‌బిన్లలో వేయమని అదా ఇచ్చిన సందేశం బాగుందని కొందరు స్పందించగా , బీఎంసీకి ఉచితంగా ప్రచారం చేస్తున్నందుకు ఆమెను అభినందించాల్సిందే’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు నడిరోడ్డులో ఈ డ్యాన్సులేంటి? అని విమర్శిస్తున్నారు. ఏదైతేనేమి ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు 1.8 లక్షల మంది ఈ వీడియోను లైక్‌ చేశారు.

Also Read: Wives Discipline: మొండిగా ఉండే భార్యలను మెల్లగా కొట్టొచ్చు.. భర్తలకు సలహా ఇచ్చిన మహిళా మంత్రి.. మండిపడుతోన్న మహిళా సంఘాలు, నెటిజన్లు..

Viral Video: ‘అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినాదిరో’.. పెళ్లికూతురుని అలా చూసిన పెళ్లికొడుకు రియాక్షన్‌..

viral News: వెరైటీ చోరీ.. ఏం దొంగిలించాడో తెలిస్తే షాక్ అవుతారు