Viral Video: ‘అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినాదిరో’.. పెళ్లికూతురుని అలా చూసిన పెళ్లికొడుకు రియాక్షన్‌..

Viral Video: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ప్రతీ చిన్న అంశం నెట్టింట వైరల్ అవుతోంది. సామాన్యుల జీవితాల్లో జరిగే సంఘటనలు సైతం వార్తల్లో నిలుస్తున్నాయి. దీనంతటికీ సోషల్‌ మీడియానే కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఓ వీడియో..

Viral Video: 'అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినాదిరో'.. పెళ్లికూతురుని అలా చూసిన పెళ్లికొడుకు రియాక్షన్‌..
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 17, 2022 | 5:20 PM

Viral Video: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ప్రతీ చిన్న అంశం నెట్టింట వైరల్ అవుతోంది. సామాన్యుల జీవితాల్లో జరిగే సంఘటనలు సైతం వార్తల్లో నిలుస్తున్నాయి. దీనంతటికీ సోషల్‌ మీడియానే కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఓ వీడియో ఇలాగే సోషల్‌ మీడియాను చుట్టేస్తోంది. ఓ పెళ్లి కొడుకు రియాక్షన్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ విషయమేంటంటే.. ఓ జంట వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ సమయంలోనే వదువు, వరుడూ వేరు వేరు గదుల్లో వివాహానికి సిద్ధమవుతున్నారు. మేకప్ ఆర్టిస్ట్‌లు వదూవరులకు మేకప్‌ వేస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పక్క గదిలో ఉన్న వరుడు, పెళ్లి కూతురు గదిలోకి వచ్చాడు. గదిలోకి వచ్చిరాగానే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. వావ్‌ అంటూ సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. ఇంతకీ ఆ పెళ్లి కొడుకును అంతగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటనేగా.?

అతన్ని ఆశ్చర్యపరిచిన విషయం మరెంటో కాదు. తనతో మరికాసేపట్లో ఏడడుగులు వేయడానికి సిద్ధమైన పెళ్లి కూతురే. క్రీమ్‌ కలర్‌ గౌనులో చూడముచ్చటగా రడీ అయిన కాబోయే భార్యను చూసి ఫిదా అయ్యాడు వరుడు. వెంటనే కాబోయే భార్య దగ్గరికి వచ్చి రెండు చేతులు పట్టుకొని చేతులపై ముద్దుల వర్షం కురిపించాడు. మరో అడుగు ముందుకేసి చెంపపై ముద్దుపెట్టడానికి ప్రయత్నించాడు, కానీ ఎక్కడ మేకప్‌ పోతుందోనని ఫ్లైగింగ్‌ కిస్‌ ఇచ్చాడు.

అనంతరం ఇద్దరు జంటలు కలిసి ఫోటోలకు పోజీచ్చారు. దీనంతటినీ అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పెళ్లికూతురును చూడగానే వరుడి కళ్లలో కనిపించిన ఆ మెరుపు.. హీరో నాగార్జున పాడిన ‘అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినాదిరో’ పాటను గుర్తుచేస్తోంది. మరి నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోను మీరూ చూసేయండి..

Also Read: Tirumala: ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం.. టీటీడీ సంచలన నిర్ణయం

DMHO Kurnool Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారానే.. కర్నూలులో 70 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఉద్యోగాలు..నెలకు లక్ష జీతం..

UP Elections 2022: యూపీ ఎన్నికల బరిలో నేర చరితులు.. కొందరిపై మర్డర్, రేప్ కేసులు కూడా..