Actor Virutchagakanth Babu : సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సినిమా అవకాశాలు లేక.. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఓ నటుడు చివరకు తనువు చాలాలించాడు. సినిమాలపై మోజుతో చాలా మంది సొంత ఊరిని, కన్నవారిని వదులుకొని ప్రధాన నగరాలకు వెళ్తుంటారు. అవకాశలకోసం ఎదురుచూస్తూ.. స్టూడియోల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతుంటారు. చివరకు ఆర్ధిక సమస్యల కారణంగా కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటుంటారు.ఇంకొంత కొంతమంది రోడ్ల పక్కన, బస్టాండ్స్ లో ఉంటారు. ఇలాంటి వార్తలు మనం తరచు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ తమిళ నటుడు కూడా అవకాశాలు రాక రోడ్లపై ఉంటూ.. చివరకు ఒక ఆటోలో కన్నుమూశాడు.
తమిళ హీరో భరత్ నటించిన ‘కాదల్’అనే సినిమా తెలుగులో ప్రేమిస్తే అనే పేరుతో డబ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా విరుత్చకాకాంత్ బాబు అనే నటుడు చిన్న పాత్రలో నటించాడు. ఆ సినిమాలో హీరో ఛాన్స్ కోసం ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఎలాగైనా హీరో అవ్వాలంటూ కొన్ని ఫోటోలను చూపిస్తాడు ఈ సీన్ కనిపించిన నటుడు విరుత్చకాకాంత్ బాబు. ఆ సినిమా తర్వాత అతడికి సినిమా అవకాశాలు రాలేదు. అందులోనూ ఇటీవలే అతడి తల్లిదండ్రులు కాలం చేశారు. మానసికంగా కృంగిపోయాడు విరుత్చకాకాంత్ బాబు. ఇక సినిమా అవకాశాలు లేక తిండి దొరక్క గుళ్ళలో, రోడ్లపైన ఉండేవాడు. చివరకు ఇలా ఒక ఆటోలో నిద్రిస్తున్న సమయంలో చనిపోయాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ తనయుడు బెన్ని టాలీవుడ్ లో ఎంట్రీ.. చిరంజీవిని కలిశా… అయితే..!