FIFA WORLD CUP 2022: ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్.. పఠాన్ మూవీ ప్రమోషన్‌.. సందడి చేయనున్న షారుఖ్, దీపికా

ఒకే రోజు, ఒకే ప్లేస్‌లో రెండు అదిరిపోయే ఈవెంట్లు.. అవి మమూలివి కాదు.. ఒకటి స్పోర్ట్స్ ఈవెంట్ అయితే.. మరొకటి ఎంటర్‌టైన్‌ మెంట్‌.. స్పోర్ట్స్‌కు, ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిస్తే మామూలుగా ఉంటుందా.. ప్రపంచ వ్యాప్తంగా..

FIFA WORLD CUP 2022: ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్.. పఠాన్ మూవీ ప్రమోషన్‌.. సందడి చేయనున్న షారుఖ్, దీపికా
Shah Rukh Khan
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 18, 2022 | 11:44 AM

ఒకే రోజు, ఒకే ప్లేస్‌లో రెండు అదిరిపోయే ఈవెంట్లు.. అవి మమూలివి కాదు.. ఒకటి స్పోర్ట్స్ ఈవెంట్ అయితే.. మరొకటి ఎంటర్‌టైన్‌ మెంట్‌.. స్పోర్ట్స్‌కు, ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిస్తే మామూలుగా ఉంటుందా.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచూర్యం పొందిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌తో పాటు.. అదే వేదికగా పఠాన్‌ మూవీ ప్రమోషన్ రెండూ ఖతర్ వేదికగా జరగనున్నాయి. అంతేకాదు.. షారుఖ్‌ ఖాన్‌తో పాటు దీపికా పదుకొనే కూడా ఫిఫా వరల్డ్ కప్‌లో సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ మూడేళ్లకుపైగా సుదీర్ఘ విరామం తర్వాత నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్‌ పఠాన్‌. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని సిద్దార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. దీపికా పదుకొనే ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ జాన్‌ అబ్రహాం కీలక పాత్ర పోషిస్తున్నాడు.

2023 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది పఠాన్‌ మూవీ. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది మూవీ యూనిట్. దీనిలో భాగంగా షారుఖ్‌ ఖాన్‌ ఏకంగా సూపర్‌ క్రేజ్‌ ఉన్న ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో పఠాన్ ప్రమోషన్స్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా ఇప్పటికే తెలియజేశాడు. ఖతార్‌లో డిసెంబర్ 18 (ఆదివారం) జరుగబోయే ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో పఠాన్ చిత్రాన్ని ప్రమోట్‌ చేయబోతున్నాడు షారుఖ్ ఖాన్.

పఠాన్‌లో వచ్చే స్టన్నింగ్‌ యాక్షన్‌ సన్నివేశాలను స్పెయిన్‌, యూఏఈ, టర్కీ, రష్యా, సైబీరియా, ఇటలీ, ఫ్రాన్స్, ఇండియా, అప్ఘనిస్థాన్‌లో షూట్‌ చేసినట్టు ఇప్పటికే అప్‌డేట్‌ ఇవ్వడంతోఈ మూవీపై సినిమా ప్రేమికుల్లో అంచనాలను మరింత పెంచేస్తున్నారు . పఠాన్‌ మూవీ హిందీ, తమిళం, తెలుగులో విడుదల కానుంది. పఠాన్‌ నుంచి ఇప్పటికే విడుదలైన దీపికా పదుకొనే, షారుఖ్‌ ఖాన్‌ ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్లు క్యూరియాసిటీ పెంచుతున్నాయి. మరోవైపు ఫిఫా వరల్డ్ కప్ వేదికగా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే పఠాన్ మూవీ ప్రమోషన్‌తో సందడి చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం చూడండి..