Young Tiger NTR: విహార యాత్రలో యంగ్‌ టైగర్‌.. భార్య పిల్లలతో కలిసి ఇలా.. స్టైలిష్‌ లుక్‌లో ఎన్టీఆర్‌..

|

Nov 21, 2021 | 8:11 AM

NTR: ఓవైపు సినిమాలు, మరోవైపు రియాలిటీ షోలతో ఫుల్‌ బిజీగా గడుపుతున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్‌..

Young Tiger NTR: విహార యాత్రలో యంగ్‌ టైగర్‌.. భార్య పిల్లలతో కలిసి ఇలా.. స్టైలిష్‌ లుక్‌లో ఎన్టీఆర్‌..
Jr Ntr
Follow us on

NTR: ఓవైపు సినిమాలు, మరోవైపు రియాలిటీ షోలతో ఫుల్‌ బిజీగా గడుపుతున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్‌.. ఎవరు మీలో కోటీశ్వరులు షోకి కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా బిజీ బిజీగా గడుపుతోన్న ఎన్టీఆర్‌ తాజాగా.. అనుకోకుండా దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపడానికి కేటాయించారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే కొరటాల ప్రస్తుతం ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ బ్యాలెన్స్‌ను పూర్తి చేసే పనిలో కొరటాల ఉన్నారు. ఇది పూర్తికాగానే ఎన్టీఆర్‌తో చిత్రాన్ని లైన్‌లో పెట్టనున్నారు.

దీంతో అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబంతో జాలీగా గడుపుతున్నారు ఎన్టీఆర్‌. ఇందులో భాగంగానే కుటుంబ సభ్యులతో కలిసి స్విట్జర్లాండ్‌ పయనమయ్యారు. ఈ క్రమంలోనే శనివారం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయలుదేరారు. భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో పాటు ఫోటోకు చిక్కారు ఎన్టీఆర్‌. ఇందులో ఎన్టీఆర్‌ చాలా స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. ఇదిలా ఉంటే స్విట్జర్లాండ్‌ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌ ఆర్‌.ఆర్‌.ఆర్‌ బ్యాలెన్స్‌ను పూర్తి చేసుకొని తర్వాత కొరటాల చిత్రంలో జాయిన్‌ కానున్నారన్నమాట. ఇక ఎన్టీఆర్‌ అప్‌కమింగ్‌ మూవీస్‌లో ప్రశాంత్‌ నీల్‌ చిత్రం కూడా ఉన్న విషయం తెలిసిందే.

Also Read: మహిళలకు ముఖ్య విషయం.. ఇప్పుడు ఈ వ్యాధిని సులువుగా గుర్తించవచ్చు.. కచ్చితమైన ఫలితాలు..

ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?

Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్‌ రేట్‌ ఎంతంటే..?