AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise Movie : నాని ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్, సోషల్ మీడియాను, షేక్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇంతకీ చిత్రయూనిట్ షేర్ చేసిన పోస్ట్ ఏంటో తెలుసుకుందామా.

The Paradise Movie : నాని ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
The Paradise
Rajitha Chanti
|

Updated on: Sep 06, 2026 | 1:50 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ది ప్యారడైజ్. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. దసరా సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆయా షేర్ సాంగ్ నెట్టింట సంచలనం సృష్టించింది. ఇక ఇటీవల విడుదలైన ఏశనాగుల సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తుంది. ఈ పాటకు మాస్ అడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ సాంగ్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి సోషల్ మీడియాలో పలు పుకార్లు ప్రచారంలోకి రావడంతో, మేకర్స్ రిలీజ్ డేట్‌పై మరోసారి స్పష్టతనిచ్చారు. సరిగ్గా మునుపటి ప్రకటన ప్రకారమే ఈ చిత్రం సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని చిత్ర బృందం స్పష్టం చేసింది.

‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో నాని మునుపెన్నడూ చూడని సరికొత్త, రగ్గడ్ మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా, రాఘవ్ జుయాల్, సోనాలి కులకర్ణి, తనికెళ్ల భరణి, బాబు మోహన్, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. అంతేకాకుండా, నటి కీర్తి సురేష్, నాని నటించిన ఏశనాగుల సాంగ్ దుమ్మురేపుతుంది.

తాజాగా ది ప్యారడైజ్ మేకర్స్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. నాని సినీ ప్రయాణం 18 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన తేదీ సెప్టెంబర్ 24న థియేటర్లలో తీసుకురానున్నట్లు ఓ వీడియోను షేర్ చేశారు. దీంతో ఈ మూవీ రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ది ప్యారడైజ్..

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

Follow Us