AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నప్పటి నుంచి నములుతున్నాం.. కానీ ఈ రెండింటి మధ్య అసలు సీక్రెట్ ఏంటో తెలుసా..?

చూయింగ్‌గమ్‌.. బబుల్‌గమ్‌.. రెండూ ఒకటే అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. పైకి ఒకేలా కనిపించే ఈ రెండింటి వెనుక ఎవరికీ తెలియని బోలెడన్ని ఆసక్తికరమైన తేడాలున్నాయి. అసలు బుడగలు ఊదేందుకు బబుల్‌గమ్‌ మాత్రమే ఎందుకు పనికొస్తుంది? ఈ రెండింటి తయారీ వెనుక ఉన్న అసలు రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చిన్నప్పటి నుంచి నములుతున్నాం.. కానీ ఈ రెండింటి మధ్య అసలు సీక్రెట్ ఏంటో తెలుసా..?
Chewing Gum Vs Bubble Gum
Krishna S
|

Updated on: Sep 07, 2026 | 4:01 PM

Share

తరగతి గది చివరి బెంచ్‌ నుంచి ఆఫీస్‌ డెస్క్‌ వరకు.. నోటి దుర్వాసన పోగొట్టడానికైనా, ఒత్తిడిని తగ్గించుకోవడానికైనా జేబులోంచి ఓ గమ్‌ తీసి నమలడం చాలామందికి అలవాటు. అయితే దుకాణానికి వెళ్లినప్పుడు చాలామంది చూయింగ్‌గమ్‌ను, బబుల్‌గమ్‌ను ఒకటే అనుకుని కొనేస్తుంటారు. పైకి రెండూ ఒకేలా కనిపించినా, వాటి తయారీ, ఉపయోగించే పదార్థాలు, వాటి ప్రయోజనాల్లో చాలా తేడాలున్నాయి. చూయింగ్‌గమ్‌ను కాస్త గట్టిదనం ఉండే సాధారణ గమ్‌ బేస్‌తో తయారు చేస్తారు. మరోవైపు బబుల్‌గమ్‌ తయారీలో ఎక్కువ సాంద్రత, బలం కలిగిన పాలీమర్‌లు, రెసిన్‌లను వాడతారు. దీనివల్ల బబుల్‌గమ్‌ చాలా మృదువుగా, సులభంగా తెగిపోకుండా సాగుతుంది. అందుకే దానితో పెద్ద పెద్ద బుడగలు ఊదడం సాధ్యమవుతుంది. చూయింగ్‌గమ్‌ను ప్రధానంగా ఎక్కువసేపు నమలడానికి, నోటిని తాజాగా ఉంచడానికి, దవడలకు వ్యాయామం అందించడానికి ఉపయోగిస్తారు. బబుల్‌గమ్‌ ముఖ్య ఉద్దేశం మాత్రం గాలితో పెద్ద బెలూన్లు చేసి, వాటిని పగలగొడుతూ సరదాగా ఎంజాయ్ చేయడమే.

ఫ్లేవర్లు, తీపి

చూయింగ్‌గమ్‌లో చక్కెర శాతం తక్కువగా ఉండి మింట్‌, పుదీనా, స్పియర్‌మింట్‌ వంటి రిఫ్రెషింగ్ ఫ్లేవర్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు నమిలినా రుచిని కోల్పోవు. బబుల్‌గమ్‌లో తీపి శాతం చాలా ఎక్కువ. స్ట్రాబెర్రీ, బనానా వంటి కృత్రిమ పండ్ల ఫ్లేవర్లను ఇందులో వాడతారు. అయితే కాసేపు నమలగానే దీని తీపి, రుచి తగ్గిపోతాయి.

రూపురేఖలు, అతుక్కునే తత్వం

చూయింగ్‌గమ్‌ కాస్త పల్చగా, నునుపుగా ఉంటుంది. దీంతో పెద్ద బెలూన్ చేయడానికి ప్రయత్నిస్తే అది పగిలి పెదవులకు, ముఖానికి గట్టిగా అంటుకుపోతుంది. బబుల్‌గమ్‌ కాస్త మందంగా అనిపించినా, అందులోని ప్రత్యేక పాలీమర్‌ల వల్ల అది పగిలినా ముఖానికి జిడ్డుగా అంటుకోకుండా సులభంగా ఊడి వస్తుంది.

చరిత్ర ఏం చెబుతోంది?

ఆహార నిపుణుల ప్రకారం.. చూయింగ్‌గమ్‌కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కానీ బబుల్‌గమ్‌ మాత్రం 20వ శతాబ్దంలో అందుబాటులోకి వచ్చింది. 1928లో డైరన్ గమ్ కంపెనీ ఉద్యోగి వాల్టర్ డీమర్ చూయింగ్‌గమ్‌ ఆధారంగానే ఈ బబుల్‌గమ్‌ను కనుగొన్నారు. ఇకపై దుకాణానికి వెళ్లినప్పుడు ఫ్రెష్‌నెస్ కోసం చూయింగ్‌గమ్‌ కావాలా, లేక సరదాగా బెలూన్లు ఊదడానికి బబుల్‌గమ్‌ కావాలా అనేది చూసుకుని ఎంచుకోండి.

Follow Us
ఎలక్ట్రికల్ ఫ్యూజ్‌లో ఎక్కువ వైర్లు వేస్తే ఏమవుతుంది?
ఎలక్ట్రికల్ ఫ్యూజ్‌లో ఎక్కువ వైర్లు వేస్తే ఏమవుతుంది?
రోజుకో అరటిపండు.. మామూలు విషయం.. మీ ఆరోగ్యానికి తిరుగులేని ఔషధం!
రోజుకో అరటిపండు.. మామూలు విషయం.. మీ ఆరోగ్యానికి తిరుగులేని ఔషధం!
డబ్ల్యూఏపీఎల్‌ తొలి ఛాంపియన్‌గా రాయలసీమ.. ఫైనల్లో గోదావరికి షాక్‌
డబ్ల్యూఏపీఎల్‌ తొలి ఛాంపియన్‌గా రాయలసీమ.. ఫైనల్లో గోదావరికి షాక్‌
గుడికి వెళ్లి వస్తున్న భార్యను కత్తితో పొడిచిన భర్త!
గుడికి వెళ్లి వస్తున్న భార్యను కత్తితో పొడిచిన భర్త!
బాడీని డీటాక్స్ చేసే అద్భుతమైన పండు.. ఉదయాన్నే ఓ కప్పు తింటే..
బాడీని డీటాక్స్ చేసే అద్భుతమైన పండు.. ఉదయాన్నే ఓ కప్పు తింటే..
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేస్తే
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేస్తే
వాళ్ళకోసం నేను పెళ్లి చేసుకోవాలా.?
వాళ్ళకోసం నేను పెళ్లి చేసుకోవాలా.?
యుద్ధం ముగియకముందే ట్రంప్ కీలక ప్రకటన..!
యుద్ధం ముగియకముందే ట్రంప్ కీలక ప్రకటన..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగుతున్నారా?ఈ విషయాలు తెలిస్తే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగుతున్నారా?ఈ విషయాలు తెలిస్తే
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ