AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Naresh: గుడ్డిగా నమ్మి ఆరు లక్షలు కట్టి మోసపోయాను.. సంవత్సరాలు వెంటాడిన బాధ.. .

జబర్దస్త్ నరేశ్ తన వ్యక్తిగత జీవితం గురించి భావోద్వేగంగా వెల్లడించారు. నవ్వులు పంచే ఆయన జీవితంలో, ముఖ్యంగా తన సోదరుడి విషయంలో పశ్చాత్తాపం వెంటాడిందని తెలిపారు. ఒక నకిలీ కన్సల్టెన్సీ కారణంగా సోదరుడు కోల్పోయిన ఆర్థిక నష్టం, దానిపై తన అంధవిశ్వాసం, ఆ తర్వాత తమ్ముడు పడిన ఆవేదన గురించి ఆయన మనసు విప్పి మాట్లాడారు.

Jabardasth Naresh: గుడ్డిగా నమ్మి ఆరు లక్షలు కట్టి మోసపోయాను.. సంవత్సరాలు వెంటాడిన బాధ.. .
Naresh
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2026 | 4:22 PM

Share

జబర్దస్త్ వేదికపై హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నరేశ్, తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని కఠినమైన, భావోద్వేగమైన క్షణాలను ఇటీవల పంచుకున్నారు. నవ్వుల వెనుక దాగి ఉన్న తన అంతరంగ బాధను, పశ్చాత్తాపాన్ని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా తన సోదరుడి విషయంలో జరిగిన ఒక సంఘటన తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని వివరించారు. తన సోదరుడి కెరీర్ బాగుంటుందని భావించి, అతన్ని అబ్రాడ్‌కు పంపడానికి ఒక కన్సల్టెన్సీకి సుమారు ఆరు నుండి ఏడు లక్షల రూపాయల వరకు చెల్లించానని నరేశ్ తెలిపారు. అయితే అది నకిలీ కన్సల్టెన్సీ అని తేలింది. ఈ విషయంలో తాను గుడ్డిగా ఒక నిర్ణయం తీసుకున్నానని, దాని వల్ల వచ్చిన ఆర్థిక నష్టం తనను, తన సోదరుడిని తీవ్రంగా బాధిచిందని ఆయన అన్నారు. కొంత మొత్తాన్ని (సుమారు 20%) మాత్రమే తిరిగి పొందగలిగినా, పూర్తి నష్టం రికవరీ కాలేదని పేర్కొన్నారు. ఈ సంఘటన తర్వాత తన సోదరుడు కూడా తనతో మాట్లాడటానికి ఇబ్బంది పడేవాడని, ఏదైనా అడగాలన్నా, సహాయం కోరాలన్నా గిల్టీగా భావించేవాడని నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు బాధపడుతుంటే తాను మరింతగా బాధపడేవాడినని చెప్పారు. ఈ అనుభవం నుండి గుణపాఠం నేర్చుకుని, ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని ఇద్దరం నిర్ణయించుకున్నామని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

గతంలో తమకు నష్టం కలిగించిన వారిపై రివెంజ్ తీసుకోవాలని ఎప్పుడూ అనిపించలేదని నరేశ్ స్పష్టం చేశారు. “ఎవరి పాపాన వాళ్ళే పోతారు” అనే తత్వంతో, ప్రస్తుతం ఆ వ్యక్తుల పరిస్థితిని చూస్తే తమకు రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం లేదని అర్థమైందని తెలిపారు. తమను అన్నవాళ్ళు, మోసం చేసిన వారి పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉందని, తమకు జరిగిన అన్యాయాన్ని కాలమే పరిష్కరించిందని పరోక్షంగా పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

తన బాల్యం గురించి మాట్లాడుతూ, నరేశ్ తమ సొంతూరు జనగాం జిల్లాలోని నర్మెట్ట మండలం హనుమంతపురం అని చెప్పారు. చిన్ననాటి స్నేహితుల్లో ఒకరైన రోహిత్‌తో ఇప్పటికీ టచ్‌లో ఉన్నానని, రోహిత్ ఒక పాన్ డబ్బా పెట్టుకుని మంచి స్థిరపడ్డాడని తెలిపారు. తమ ఇంట్లో వారికి డబ్బు అవసరమైనప్పుడు రోహిత్ ఎప్పుడూ సహాయం చేస్తాడని, ఇంటికి వచ్చి క్యాష్ అందిస్తాడని ప్రశంసించారు. తన స్కూల్ రోజులను గుర్తు చేసుకుంటూ, తాను స్కూల్‌కు చాలాసార్లు బంక్ కొట్టానని నవ్వుతూ చెప్పారు. ఒక ఆగస్టు 15న స్కూల్ నుండి వెళ్లిపోయి, స్నేహితులతో చాలా దూరం తిరిగి, మరుసటి రోజు స్నేహితుడితో సహా ప్రిన్సిపాల్‌కు దొరికిపోయిన సంఘటనను పంచుకున్నారు. దెబ్బలు పడకపోయినా, నీల్ డౌన్ చేయించడం, బెంచ్ మీద నిలబెట్టడం వంటివి జరిగాయని గుర్తు చేసుకున్నారు. తనకు లవ్ స్టోరీలు లేవని, అమ్మాయిలతో ఫ్రెండ్‌షిప్ చేస్తానని, కానీ ఎక్కువ క్లోజ్‌గా ఉంటే తేడాగా అనుకుంటారేమోనని తానే దూరంగా ఉంటానని నరేశ్ వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

Follow Us